హైదరాబాద్

అలరించిన ‘అన్నమాచార్య’ కీర్తనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: పద్మశ్రీ శ్రీరంగం గోపాల రత్నం జయంతి సందర్భంగా ప్రముఖ గాయకుడు వై.సుబ్రహ్మణ్యం నిర్వహణలో ‘అన్నమాచార్య’ కీర్తనలు విభావరి బృందావనం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు శ్రీరంగం వేణు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. గాయకులు అలపించిన అన్నమాచార్య కీర్తనలు అలరించాయి. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు నూకల ప్రభాకర్ పాల్గొన్నారు.

హాస్య చిత్రాలకు ఆదరణ
కాచిగూడ, జూన్ 16: హాస్య చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు రామ సత్యనారాయణ అన్నారు. ‘గండికోట రహస్యం’ హస్య చిత్ర ట్రైలర్‌ను ఆనంద లహరి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళావేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామ సత్యనారాయణ పాల్గొని చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. గండికోట రహస్య చిత్రం దర్శకుడు ఎంతో అద్భుతంగా నిర్మించారని తెలిపారు. కళారత్న మల్లం రమేష్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, నటుడు జెన్నీ, చిత్ర యూనిట్ పరాంకుశం రవికుమార్, సత్య పొదిల, పాద సత్యనారాయణ, చంద్రముఖి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ‘వినోదాల విందు’
కాచిగూడ, జూన్ 16: ఫ్రెండ్స్ కామెడీ క్లబ్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘వినోదాల విందు’ కార్యక్రమం ఆదివారం గానసభలోని గుండవరపు హనుమంత రావు వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, వేముల గంటి శ్రీనివాస రావు పాల్గొని కళాకారులను అభినందించి సత్కారించారు. హస్య నటులు ఎంవీ సుబ్రహ్మణ్యం, ఈశ్వర్ రావు, జీవీ లక్ష్మీ, నాగరాజు, నాగ గణేష్, ప్రదీప్, సాయితేజ, సాయి కృష్ణ, చలపతి ప్రదర్శించిన ‘టెక్నాలజీ, దురదృష్టం, బ్రెయిన్ ట్యూమర్, చందమామా, ఈకాలం పిల్ల’ తదితర స్కీట్స్‌ను ప్రదర్శించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు
కేపీహెచ్‌బీకాలనీ, జూన్ 16: కేపీహెచ్‌బీకాలనీ 3వ ఫేజ్‌లోని రమ్యా గ్రౌండ్ సమీపంలోని కట్టావారి సేవా కేంద్రంలో మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ, హిందూ సేవా సమితి సంయుక్తంగా నిర్వహించిన హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకుడు బంధా విశే్వశ్వర్ రావు పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
మహనుభావుల జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కట్టా నర్సింగ్ రావు, బీజేపీ నేత విశే్వశ్వర్ రావు మాట్లాడుతూ శివాజీ హిందువు అయినప్పటికీ తన సామ్రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూసేవారని చెప్పారు. 17 ఏళ్ల వయస్సులో శివాజీ మొట్ట మొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యాన్ని సొంతం చేసుకున్నారని తెలిపారు. యంపరాల సాంబశివ రావు, ఏరువ శ్రీనివాస్ రెడ్డి, వాసిరెడ్డి లక్ష్మీనారాయణ, ఏనుగు వెంకటేశ్వర్ రెడ్డి, ఇనంపూడి శివ సత్యనారాయణ, పిడుగు నాగ శ్రీనివాస్, కాట్రగడ్డ సాంబశివ రావు, మండవ సుబ్రమణ్యం, కోటేశ్వర్ రావు, సాంబశివరావు, పురుషోత్తం గుప్త, శ్రీనివాస్ రావు, సాంబశివ రావు పాల్గొన్నారు.