హైదరాబాద్

వడ్డెర సమస్యల పరిష్కరానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: వడ్డెర సమస్యలను పరిష్కరానికి తమవంతు కృషి చేస్తామని పలువురు వక్తలు అన్నారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన వడ్డెర్ల ప్రజాప్రతినిధులకు సన్మాన సభ జాతీయ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు పాల్గొని ప్రసంగించారు. వడ్డెర్లు రాజకీయంగా ఎంతో ఎదుగుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వడ్డెర కులస్థులకు ఎంతో గుర్తింపు వచ్చిందని తెలిపారు. వడ్డెర్లు ఐక్యంగా ఉంటూ రాజకీయంగా ఎదగాలని సూచించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని వివరించారు. కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్మన్ అనితా నాగరాజు, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు వేముల వెంకటేష్, వల్లెపు మొగిలి, ప్రతినిధులు కుంచాల ఏడుకోండలు, రూపాని లోకనాథం, పీట్ల శ్రీ్ధర్, బత్తుల లక్ష్మీ కాంతయ్య పాల్గొన్నారు.

ఇంత నిర్లక్ష్యమా!
* డ్యాన్సర్ ఆరోపణలపై కొనసాగుతున్న అంతర్గత విచారణ * కఠిన చర్యలు తప్పవు
ఖైరతాబాద్, జూన్ 16: జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా పేరు సంపాదించిన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌పై నిర్లక్ష్యపు ఆరోపణలు రావడం ఉన్నతాధికారులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని లిస్బెన్ పబ్‌లో పనిచేసే డ్యాన్సర్‌పై తోటి డ్యాన్సర్లు, మరో వ్యక్తి దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. పోలీసులను ఆశ్రయిస్తే నిర్లక్షం, దురుసుగా ప్రవర్తించారని, నిందితుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారని మీడియా ముందు తన గోడును బాధితురాలు వెల్లుబుచ్చుకుంది. డ్యాన్సర్ ఆరోపణలను ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై అంతర్గతంగా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆదేశాలు అందడంతో విచారణ జరిపి నిర్దారణయితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.