హైదరాబాద్

పన్ను వడ్డనకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సంక్షోభం వైపు అడుగులు వేస్తున్న జీహెచ్‌ఎంసీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు బల్దియా ఉన్నతాధికారులు అందుబాటులో ఉన్న అన్ని ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. నగరంలో కొనసాగుతున్న ఎస్‌ఆర్‌డీపీ బిల్లుల చెల్లింపుల కోసం మరో రూ.305 కోట్లను బాండ్ల జారీతో సమకూర్చుకునేందుకు స్థారుూ సంఘం ఆమోదం వేసిన సంగతి తెలిసిందే! దీనికి తోడు ఆదాయం వచ్చే మార్గాలన్నింటిలో నిధుల సమీకరణ కోసం అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జీహెచ్‌ఎంసీకి ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్నుపై కూడా అధికారులు దృష్టి సారించారు. పన్ను పెంచకుండా నిధులను సమీకరించుకుంటామని, కొత్తగా నిర్మిస్తున్న ఆస్తుల అసెస్‌మెంట్‌పై దృష్టి సారించాలని ఒకవైపు ఆదేశాలు జారీ చేస్తున్న అధికారులు సక్రమంగా నామమాత్రపు పన్ను చెల్లిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలపైన రీఅసెస్‌మెంట్ పేరిట మరోసారి భారం మోపేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో సునామీ సర్వే నిర్వహించిన బల్దియా అధికారులు రూ. 250 కోట్లను అదనంగా వసూలు చేసుకున్నారు. సుమారు దశాబ్దంన్నర క్రితం ఆస్తిపన్ను సవరించిన అధికారులు ప్రస్తుతం ఆస్తిపన్ను చెల్లిస్తున్న సుమారు 13లక్షల ఖాతాల్లో రూ.వెయ్యి నుంచి లక్ష రూపాయల లోపు చెల్లిస్తున్న ఖాతాలకు సంబంధించిన ఆస్తులను రీఅసెస్‌మెంట్ చేస్తున్నారు. మూడు నెలల క్రితమే ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉండగా, అప్పట్లో ఎండలు బాగా మండిపోవటం, ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో ట్యాక్సు సిబ్బంది అభ్యర్థన మేరకు అప్పట్లో మినహాయింపునిచ్చిన కమిషనర్ ఇపుడు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కొద్దిరోజుల క్రితం అధికారులను ఆదేశించారు. దీంతో సర్కిళ్ల స్థాయిలోని బిల్ కలెక్టర్లు, ట్యాక్సు ఇన్‌స్పెక్టర్లు రూ.వెయ్యి నుంచి లక్ష లోపు పన్ను చెల్లిస్తున్న ఆస్తులను రీఅసెస్‌మెంట్ చేస్తున్నారు. గత బల్దియా ఎన్నికల్లో అప్పటి వరకు రూ.1200 చెల్లిస్తున్న ఆస్తిపన్ను బకాయిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.101కు కుదించిన సంగతి తెలిసిందే. రూ.101 పన్ను చెల్లించేందుకు సిటిజన్ సర్వీసు సెంటర్లకు వస్తున్న ఖాతాదారుల నుంచి పన్నును స్వీకరించేందుకు బల్దియా సిబ్బంది ససేమిరా అంటున్నట్లు సమాచారం. తక్కువగా పన్ను చెల్లిస్తున్న బకాయిదారులకు నోటీసులు జారీ చేస్తున్నామని, రాని వారికి త్వరలోనే నోటీసులు వస్తాయని, వచ్చిన తర్వాత సవరించిన పన్నును చెల్లించాలని సీఎస్‌సీ కేంద్రాల్లో సిబ్బంది బహాటంగానే చెబుతున్నట్లు బకాయిదారులు వాపోతున్నారు.