హైదరాబాద్

ప్రాచీన కళలను కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: అంతరించిపొతున్న ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. ప్రముఖ భాగవతారిణి ఆర్.రేఖ ‘గిరిజా కళ్యాణం’ హరికథా గానం శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా వేంకట దీక్షితుల కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాములు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో అనేక ప్రాచీన కళలు అంతరించి పొతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. హరికథా కళలను గానసభ ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో రచయిత్రి లక్కరాజు నిర్మల, ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, కినె్నర కార్యదర్శి కినె్నర రఘురామ్ పాల్గొన్నారు.
వెంకట రావుకు ‘ఏకాపద్మ’
పురస్కారం ప్రదానం
కాచిగూడ, జూన్ 19: శ్రీకిరణ్ సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో అవంతి కాలేజ్ డైరెక్టర్ డా.డీ.వెంకట రావుకు ‘ఏకాపద్మ’ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ పారిశ్రామిక వేత్త డా.వైఎం ధర్ పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. ప్రముఖ దంత వైద్యులు శివ శ్రీనివాస్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, నేటి నిజం సంపాదకుడు బైస దేవదాసు, ఏకానాగరాజా రామ మోహన రావు, సంస్థ అధ్యక్షుడు లంకా వెంకట సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
గాయకుడు మిత్రకు బిరుదు ప్రదానం
కాచిగూడ, జూన్ 19: ప్రముఖ గాయకుడు డా.మిత్రకు ‘మధురస్వర కంఠీరవ’ బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం సుప్రసిరి ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ డా.నందిని సిధారెడ్డి పాల్గొని మిత్రకు బిరుదును ప్రదానం చేశారు. మిత్ర గత నాలుగు దశాబ్దాలుగా అనేక ప్రదర్శనలు ఇచ్చి ఎంతో పేరు సంపాధించుకున్నారని తెలిపారు. ఆయనకు బిరుదు ప్రదానం చేసి ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో వైకే నాగేశ్వర రావు, డా.బేతపూడి ఆనంద్, జీ.రాధాకృష్ణ, రచయిత్రి లక్కరాజు నిర్మల, సంస్థ అధ్యక్షురాలు వీకే దుర్గ పాల్గొన్నారు.