హైదరాబాద్

ఆవును కాపాడిన డిజాస్టర్ టీమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పని నైపుణ్యతతో పాటు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న మూగ జీవాలను కూడా రక్షించటంలో మరో అడుగు ముందుకేసింది. ప్రమాదవశాత్తు సెట్టిక్ ట్యాంక్‌లో పడ్డ ఆవును బల్దియా విపత్తుల నివారణ బృందం రక్షించటం పట్ల బృందాన్ని మేయర్ బొంతు రామ్మోహన్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆల్విన్‌కాలనీ రహదారిపై సెప్టిక్ ట్యాంక్‌కు ఏ విధమైన ప్రహరీగోడ, పై కప్పు లేకపోవటంతో పదిరోజుల క్రితం ఈ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తు ఓ ఆవు పడిపోయింది. సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డ ఆ ఆవును ఎవరూ గమనించకపోవటంతో పది రోజుల నుంచి ఆ ఆవు ట్యాంక్‌లోనే ఉండిపోయింది. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు ఇదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ టీంకు సమాచారాన్ని అందించారు. వెంటనే బృందం రంగంలోకి దిగి, డిజాస్టర్ టీం తాడు, ఇతర పరికరాల సహాయంతో ఆ ఆవును సెప్టిక్ ట్యాంక్ నుంచి సురక్షితంగా బయటకు తీసింది. గత పదిరోజులుగా ఏ విధమైన ఆహారం, నీరు లేకపోవటంతో ఆ ఆవు బక్కచిక్కిపోవటాన్ని గమనించిన ఈ టీం దాన్ని శుభ్రపరిచి, గడ్డిని ఆహారంగా పెట్టి, మంచినీటిని తాగించారు. అంతేగాక, ఆ ఆవును చికిత్స నిమిత్తం సమీపంలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. గత పదిరోజులుగా సెప్టిక్ ట్యాంక్‌లో పడిన ఆవును రక్షించి, దాన్ని పట్ల మానవత్వాన్ని చూపి శుభ్రపరిచి, ఆహారం, మంచినీళ్లు అందించినందుకు గాను మేయర్ బొంతు రామ్మోహన్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కాగా, కొద్దిరోజుల క్రితం నల్లగండ్ల చెరువుల్లో చిక్కుకుపోయిన జింకను బృందం రక్షించి ప్రశంసలు పొందిన విషయం విదితమే.