హైదరాబాద్

మరో పదివేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో ఎక్కడబడితే అక్కడ, ఇష్టారాజ్యంగా అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, బ్యానర్ల తొలగింపునకు బల్దియా నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ బుధవారం కూడా కొనసాగింది. సూరత్‌లోని కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించి పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ప్రాణభయంతో భవనం నుంచి కిందకు కూడా గాయాలపాలైన ఘటన విధితమే. ఈ ఘటన నేపథ్యంలో స్పందించిన జీహెచ్‌ఎంసీ రెండు రోజుల క్రితం ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్ బుధవారం కూడా నిర్వహించారు. తొలి రోజు సుమారు 20వేల ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించగా, రెండోరోజైన బుధవారం అమీర్‌పేట మైత్రివనం పరిసర ప్రాంతాల్లోని పలు కోచింగ్ సెంటర్లు, కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లు ప్రమాదకరంగా ఏర్పాటు చేసిన మరో పదివేలను తొలగించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఎవర్నీ ఉపేక్షించకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించటం పట్ల పలువురు పౌరులు.. బల్దియాను ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రాం, వాట్సప్ వంటి సోషల్ మీడియాల్లో ప్రశంసించారు. పలు భవనాల్లో మూడు, నాలుగో అంతస్తుల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను సైతం జీహెచ్‌ఎంసీకి చెందిన 30 బృందాలు తొలగించాయి. విద్యార్థులు హాజరయ్యే కోచింగ్ సెంటర్లు, కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లలో చాలా సంస్థలకు అగ్నిప్రమాద నివారణ ప్రమాణాలు లేకపోవడాన్ని గమనించిన కమిషనర్ దాన కిషోర్ ఆదేశాల మేరకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు.
40 అక్రమ నిర్మాణాల కూల్చివేత
పాతబస్తీలోని మీరాలం చెరువులో వెలిసిన 40 అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, అధికారులు, పోలీసులు బుధవారం కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య పది జేసీబీలు, వంద మందిపైగా సిబ్బందితో నాలుగు కట్టర్లతో కూల్చివేతలను ప్రారంభించారు. ఇందులో శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు ఉన్నాయి. మీరాలం ట్యాంక్ శిఖం భూమిలో వెలిసిన ఈ అక్రమ నిర్మాణాలను తొలగించనున్నట్లు గతంలోనే నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. నోటీసులకు స్పందించకపోవటంతో బుధవారం కూల్చివేతలు చేపట్టినట్లు వివరించారు.