హైదరాబాద్

బకాయిలు చెల్లించకుంటే ‘ఆరోగ్యశ్రీ’ నడపలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణలోని ప్రైవేటు హాస్పిటల్స్, నర్సింగ్‌హోం లకు గత 8నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సల బకాయిలు మే1వ తేదిలోగా చెల్లించాలని తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ (్థనా) డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయక తప్పదని తేల్చి చెప్పింది. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు డాక్టర్.టి.నరసింగరెడ్డి, డాక్టర్.ఎల్.సురేష్‌గౌడ్, డాక్టర్. ఇంద్రసేన్‌రెడ్డి, డా.శ్రీనివాస్, డా.బద్రారెడ్డి, నరేందర్ మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలకు దాదాపు190 ఆసుపత్రులలో జరిగిన శస్తచ్రకిత్సలకు దాదాపు రూ.250 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని అన్నారు. ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉండటంతో ఆసుపత్రులు నిర్వహించలేని స్థితిలో ఉన్నామని వాపోయారు. ప్రభుత్వం గతంలో ఇచ్ని హామీ మేరకు తాము ఇన్ని రోజులు ఆగామని, ప్రస్తుతం తాము ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయక తప్పటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎప్పుడూ రోగుల పక్షాన ఉంటామని, వారికి ఇబ్బందులు కల్పించటం తమ ఉద్దేశం కాదని అన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించాలాని కోరారు.