హైదరాబాద్

పలు ప్రాంతాల్లో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: వేసవికాలం ఎండల నుంచి విసిగి వేసారిన నగర ప్రజలకు ఉపశమనంగా ఆదివారం తొలకరి జల్లులు పలకరించాయి. దాదాపు పదిహేను రోజులు ఆలస్యలైనప్పటికీ ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న రుతుపవనాలు ప్రవేశించడంతోనగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. రికార్డు స్థాయిలో మండిన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు రుతుపవనాలు చల్లని కబురును తీసుకువచ్చాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలో మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షంతో చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ వాననీటితో నిండిపోయాయి. చిన్నపాటి వర్షానికి సైతం జలాశయాలను తలపించే నగర రహదారులు ఎప్పటిలాగే వాననీటితో నిండిపోయాయి. నగరంలో ముందు జాగ్రత్తచర్యగా జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికి ధీటుగా ఎదుర్కోవడానికి సిబ్బందిని సన్నద్ధం చేశారు. ఎంత చేసినా ఇరుకైన నాలాలు తూతూ మంత్రంగా పూడికతీసిన నాలాలు వాననీటితో మురికివాడల ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తాయనడంతో ఎంతమాత్రం సందేహం లేదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెరుచుకునే మ్యాన్‌హోల్స్, గుంతలమయంగా మారిన రోడ్లు, పొంగిపొర్లే నాలాలతో ఆదమరిచి అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకావం లేకపోలేదు. గతంతో అంబర్‌పేట్‌తోపాటు పలు ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్‌లో పడిపోయి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనల దృష్ట్యా ఇటు ప్రజలు అటు అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
షాబాద్: షాబాద్ మండలంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో మూసీ వాగు పరుగులు తీసింది. షాబాద్ మండల రైతులు విత్తనాలు నాటేందుకు అనుకులంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. షాబాద్ మండల పరిధిలోని నాగర్‌గూడలో పెట్రోల్ బంక్ నుంచి శంషాబాద్ చౌరస్తా వరకు రోడ్డు పై వాగులా నీరు పారుతుంది. దీంతో పాద చారులు గ్రామంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.