హైదరాబాద్

గ్రామ స్వరాజ్యాన్ని సంరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: గ్రామ స్వరాజ్యాన్ని సంరక్షించడం ద్వారానే దేశాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయగలమని ఆల్ ఇండియా పంచాయత్ పరిషత్ చైర్మన్ అశోక్ చవాన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంచాయత్‌ల నిర్వహణపై పర్యాటనకు వచ్చిన జాతీయ బృందం ఇటీవల పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడాన్ని హర్షించింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర పంచాయత్ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జాతీయ కార్యదర్శులు ధ్యాన్‌పాల్ సింగ్, వీరంజనేయులు, రాష్ట్ర చైర్మన్ నాగుబండి సత్యనారాయణతో కలిసి మాట్లాడారు. దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలని, గ్రామ స్థాయిలో సమర్దవంతంగా పాలన సాగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించాలని కోరారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో గ్రామాల విశిష్టతను తెలుసుకొని రాజ్యాంగ సవరణ ద్వారా అధికారాలను కట్టబెట్టారని చెప్పారు. 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామాలకు అధికారాలు, నిధులు అందించాల్సి ఉన్నా అది జరగడం లేదని అన్నారు. గ్రామాల స్వయం సమృద్ధికి 29 అంశాలను పకడ్బందీగా అమలు చేయాల్సి ఉన్నా ఏ రాష్ట్రంలో చేయడం లేదని వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన పంచాయతీలను ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ విషయమని, అదే సమయంలో అధికారాలు, నిధులు ఇవ్వాలని కోరారు. ఉప సర్పంచ్‌కు చెక్ పవర్‌ను ఇవ్వడం సరికాదని, దీంతో ఎన్నో ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. గ్రామానికి మొదటి పౌరుడైన సర్పంచ్‌కు మాత్రమే అధికారాన్ని అందించే విషయంపై సీఎం కేసీఆర్ ఆలోచించాలని సూచించారు. సమావేశంలో జలీస్, యాదయ్య పాల్గొన్నారు.