హైదరాబాద్

జోరు వానతో గడగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్: నైరుతీ రుతుపవనాల ప్రభావంతో నగరం, రంగా రెడ్డి, మేడ్చల్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వర్షపునీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ను క్ల్లియర్ చేయడానికి సిబ్బంది అంతా విధులు నిర్వహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు కలగకుండా సైబరాబాద్ పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని బయటకు పంపి వాహనాలను పం పించామని అధికారులు వెల్లడించారు. జీహేచ్ ఎంసీ, మెట్రో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారాలను కనుకుంటున్నట్లు తెలిపారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్,ఎస్‌ఆర్‌నగర్, సికిందరాబాద్, నాంపల్లి, కోఠి, అబీడ్స్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, మలక్‌పేట, ఎల్బీనగర్, సంతోష్‌నగర్, అల్వాల్, బొల్లారం, మెహిదీపట్నంలో ఆదివారం భారీ వర్షం పడింది. కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం కురవడంతో పలు రహదారులు చెరువులుగా తలపిస్తున్నాయ. దీంతో వాహనదారులతోపాటు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూకట్‌పల్లిలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయ. గంటపాటు వర్షం కురిస్తేనే రోడ్లు చెరువులను తలపించడంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగస్తులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయ. పలు ప్రాంతాల్లో శుభకార్యాలకు హాజరయ్యేందుకు నగర వాసులు వాహనాలతో రోడ్లపైకి రావడంతో కిలోమీ టర్ల మేర వాహనాలు నిలిచిపోయాయ. దీంతోజనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు అధికారులు రంగంలోకి దిగి నేల కూలిన చెట్ల్లు, విద్యుత్ స్తంభాలను తొలగించారు. మల్లాపూర్‌లో ఈదురుగాలులు వర్షానికి పలు చోట్ల ఫ్లెక్సీలు హూర్డింగ్‌లు నేలకొరిగాయ. యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో పలు కాలనీల్లోకి వర్షపు నీరు పోటెత్తడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.