హైదరాబాద్

శాసించిన మహాకవి శ్రీశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ అని పలువురు వక్తలు అన్నారు. శ్రీశ్రీ కవిత్వం - సార్వకాలీనత’ అనే అంశంపై విజ్ఞాన రత్న కే.సర్వ మంగళ గౌరి ప్రసంగ కార్యక్రమం వంగూరి ఫాండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, వంశీ సంస్ధల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, అధ్యక్ష, కార్యదర్శులు డా.తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు. శ్రీశ్రీ సినిమా పాటల రచయితగా ప్రసిద్ధి చెందాడని పేర్కొన్నారు. ఆయన రచించిన కావ్యాల్లో ‘మహాప్రస్థానం’ ప్రసిద్ధి చెందిందని తెలిపారు. శ్రీశ్రీ కవిత్వంపై సర్వమంగళ గౌరి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.