హైదరాబాద్

తెలుగు కథా మహనీయుడు పాలగుమ్మి పద్మరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలుగు కథను ప్రపంచ సాహితీ పటములో నిలిపిన ఘనత పాలగుమ్మి పద్మరాజుకే దక్కుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహా రెడ్డి అన్నారు. ప్రముఖ సాహితీవేత్త పాలగుమ్మి పద్మరాజు జయంతి సభ శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో సోమవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏనుగు నరసింహా రెడ్డి పాల్గొని పద్మరాజు చిత్ర పటానికి నివాళి అర్పించారు. తన జీవిత కాలంలో పాలగుమ్మి పద్మరాజు 60 కథలు, 8 నవలలు, 30 కవితలతో పాటు అనేక నాటికలను రచించారని తెలిపారు. ‘గాలివాన’ ప్రపంచంలోని అనేక భాషలలో అనువాదించబడిందని పేర్కొన్నారు. సాహిత్య రంగనికి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో నేటి నిజం సంపాదకుడు బైస దేవదాసు, గానసభ ఉపాధ్యక్షుడు సీహెచ్‌వీ ప్రసాద్, సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి చక్రపాణి పాల్గొన్నారు.

అలరించిన ‘సంకీర్తనా కుసుమాలు’
కాచిగూడ, జూన్ 24: కళ్యాణానంద పీఠం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త డా.పులిగడ్డ హనుమంతరాయ శర్మ రచించిన ‘సంకీర్తనా కుసుమాలు’ గానామృతం కార్యక్రమం కళ్యాణాందన పీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు పాల్గొని గాయకులను సత్కారించి అభినందించారు. ప్రముఖ సంఘ సేవకుడు భేరి రామచందర్ యాదవ్‌కు సాంస్కృతిక కళాబంధు బిరుదును ప్రదానం చేశారు. సంగీత కళారత్న యరగొల్ల శ్రీనివాస్ యాదవ్ శిష్య బృందం అలపించిన సంకీర్తనలు అలరించాయి.