హైదరాబాద్

ఐటీ కారిడార్‌లో ఇంకుడు గుంతల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చిన్నపాటి వర్షానికే ఎన్నో చిక్కులు ఎదుర్కొనే నగరం ఇటీవల కురిసిన సుమారు 11 సెంటీమీటర్ల వర్షానికి వణికిపోయిన సంగతి తెలిసిందే! నిత్యం వేలాది మంది ఐటీ నిపుణులు, పలువురు ప్రముఖులు రాకపోకలు సాగించే ఐటీ కారిడార్ వర్షం కారణంగా మొట్టమొదటి సారిగా ముంపునకు గురైంది. పలు ప్రాంతాలు నీట మునగటంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరటం, కూడళ్లు చెరువులను తలపించటంతో గంటల తరబడి ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిల్చిపోవల్సిన పరిస్థితులు తలెత్తాయి. ముంపునకు గురైన ప్రాంతాల్లో రెండురోజులుగా పర్యటించిన కమిషనర్ దాన కిషోర్ ఐటీ కారిడార్‌లోని ప్రాంతాల్లో వర్షపు నీరు ఆగకుండా, ఎప్పటికపుడు సజావుగా ప్రవహించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతేగాక, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టాలు బాగా పడిపోవటంతో వర్షపు నీరు ఎక్కడికక్కడే ఇంకేలా భారీగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖల భూములను గుర్తించి, నివేదికలు పంపాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఐటీ కారిడార్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గతంలో ఏర్పాటు చేసిన వాటర్ హర్వేస్టింగ్ పిట్‌లు ఉన్నా, అవి ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారటంతో వాటికి కూడా మరమ్మతులు చేసి, వాటిలో నీరు ఇంకేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతేగాక, ఈ కారిడార్‌లో భారీగా వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని, ఇక్కడ నిలిచే నీరు, అక్కడి నుంచి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఇంకేలా భారీ సైజులో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే వర్షపు నీటిని కాపాడుకోవటంతో పాటు వివిధ ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా నివారణ చర్యలు చేపట్టవచ్చునని కమిషనర్ అధికారులను ఆదేశించారు. తొలి దశగా ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీకి చెందిన ఖాళీ స్థలాల్లో ఈ భారీ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి, వాటి తద్వారా వచ్చే ఫలితాలను బేరీజు వేసుకున్న తర్వాత ఇతర ముంపు ప్రాంతాల్లో ఇలాంటి గుంతలను నిర్మించాలని బల్దియా యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు ఫుట్‌పాత్, నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం కూడా ముంపునకు ప్రధాన కారణంగా గుర్తించారు. వీటిని తొలగించేందుకు క్షేత్ర స్థాయిలో రాజకీయంగా ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా పక్కా ప్రణాళికతో కూల్చివేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యచరణను సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే నగరంలోని ప్రతి ఇంట్లో హార్వేస్టింగ్ గుంతలను ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉన్నా, అది ఏ మాత్రం అమలు కాకపోవటానికి కారణాలను కూడా గుర్తించి, పక్కాగా అమలయ్యేందుకు వీలుగా చర్యలు చేపట్టేందుకు సిద్దమవుతోంది.