హైదరాబాద్

పోలీస్‌స్టేషన్ల పరిసరాల్లో మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిసరాల్లో మొక్కలు నాటాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఆయన డిజిపి కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ హరిత తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కొన్ని రోజులుగా ఎండలు తీవ్రమై తాగు నీటి సమస్య ఏర్పడిందని, చెరువులు ఎండిపోయి, బోరుబావులు ఆవిరై, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయన్నారు. వీటన్నింటికి కారణం చెట్లు లేకపోవడమేనని, వాతావరణ సమతుల్యాన్ని కాపాడాలంటే చెట్లను పెంచాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ విభాగాల్లో అత్యధిక సంఖ్యలో చెట్లను నాటాలని, కార్యాలయ పరిసరాలు పచ్చగా ఉంటే సిబ్బంది, ఇక్కడికి వచ్చే మనుషలు కూడా అరోగ్యంగా ఉంటారని డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో డిజిపితో పాటు పోలీస్ ఉన్నతాధికారులు సుదీప్ లక్టాకియా, నవీన్ చద్‌ర సందీప్ శాండిల్య, శ్రీనివాస్‌రెడ్డి, ఎంకె సింగ్, బెటాలియన్స్ ఐజి శ్రీనివాసరావు, డిఎస్పీ స్టోర్స్ గిరిరాజ్, సిఎస్‌ఓ యోగేశ్వరరావు, ఒఎస్డీ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.