హైదరాబాద్

పురస్కారాలు అందించడం సంప్రదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 22: పురస్కారాలు అందించడం మన సంప్రదాయాన్ని తెలియజేస్తుందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి.రమణాచారి అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టివిపిసి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత, రేడియో జర్నలిస్టు డి. వెంకటరామయ్యకు బి.బీమయ్య అవార్డును, డైరెక్టర్, కెమెరామెన్ ప్రభుకు ఆగస్త్య మెమోరియల్ అవార్డును ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురస్కారాలు అందించడం ఆ రంగంలో కృషి చేసిన వారికి గుర్తింపు లభించడంతో పాటు ముందు తరాలవారికి ఆదర్శంగా నిలిచే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఓ సంస్థను ఏర్పాటు చేయడం సులువే కాని దానిని సమర్ధవంతంగా నిర్వహించడం ఎంతో కష్టసాధ్యమని అలాంటిది కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి అద్భుతంగా నిర్వహిస్తున్న షరీఫ్‌ను రమణాచారి ప్రత్యేకంగా అభినందించారు. తనకు ఇష్టమైన రచయిత వెంకటరామయ్యకు పురస్కారాన్ని అందించే కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అల్లం నారాయణ అన్నారు. అనంతరం షరీఫ్ మహ్మద్ మాట్లాడుతూ ఎంతోమందికి ఉపాధి నిస్తున్న టెలివిజన్ రంగంలో పనిచేస్తున్న వారికి హెల్త్‌కార్డులు అందించడంతో పేద కళాకారులకు స్థలాలు అందించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన అల్లం నారాయణ మీ విన్నపాన్ని కమిషనర్, ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జూన్ నెలలో పది నిమిషాల నిడివితో నిర్మించిన షార్ట్ఫిలిమ్స్‌కు అవార్డులు అందించాలని నిర్ణయించినట్టు షరీఫ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ, మదన్‌గుప్తా, రఫి తదితరులు పాల్గొన్నారు.