హైదరాబాద్

ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జాయంట్ యాక్షన్ కమిటి ఫర్ స్కూల్ ఫీ రెగ్యులేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు - తల్లిదండ్రులు, విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలపై ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిధులుగా జస్టిస్ చంద్రకుమార్, ఎన్‌సిపిసిఆర్ మాజీ చైర్‌పర్సన్ ప్రొ.శాంతా సిన్హా, డా.ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి సిజిఎం డా.బుల్లయ్య హాజరయ్యారు. చంద్రకుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులలోని విద్యాహక్కు సమగ్రంగా, పారదర్శకంగా అములు చేయాలని డిమండ్ చేశారు. ప్రభుత్వంపరంగానే విద్యావిదానాన్ని మెరుగుపరచాలని అన్నారు. శాందాసిన్హా మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లలో కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా టీచర్లచే చాకిరీ చేయించుకుంటూ వేధింపులకు గురిచేస్తున్నారని, ఆప్రభావం విద్యార్థులపై పడుతుందని అన్నారు. ప్రైవేటు స్కూళ్లలో కార్యకలాపాలు, విద్యావిదానాలు, టీచర్ల అర్హతలు, వేతనాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని కోరారు.