హైదరాబాద్

బీసీ కమిషన్ చైర్మన్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : గుర్తింపు లేని కులాలను బీసీల్లో చేర్చాలని సారోళ్ల కులానికి చెందిన ప్రతినిధులు ఇచ్చిన వినతులను పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు హైదరాబాద్ జిల్లాలో బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ సారోళ్ల కులానికి చెందిన ప్రజల జీవన ప్రమాణాలు, సాంఘిక హోదా, విద్యార్హతలు, వారు ప్రస్తుతం గడుపుతున్న జీవనాన్ని స్వయంగా తెలుసుకోవడం కోసమే ఈ పర్యటన ఉద్దేశ్యమని అన్నారు. సారోళ్లు వారి కులవృత్తి విడిచి పెట్టి ప్రస్తుతం ఎలాంటి వృత్తుల్లో పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించామని చెప్పారు. కుటుబం, కులం, సంస్కృతి వివరాల సేకరణ 2019లో భాగంగా సారోళ్ల కులానికి చెందిన వారి వివరాలను ఈ సర్వేలో సేకరించారు.
కుల వివక్ష, సాంఘిక వివక్షకు ఏదైనా గురవుతున్నారా, లేదంటే కులవృత్తి, నేడు చేస్తున్న వృత్తులు, కుల వృత్తి పుట్టు పూర్వోత్తరాల గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు. సారోళ్ల కులానికి చెందిన వారిలో విద్యా ప్రమాణాలు, ఉపాధి, స్థిరచరాస్తులు, సొంత రవాణా సాధనాలు వంటి వివరాలు సేకరించారు. పర్యటనలో వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ వెంట వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి విమలదేవి, హైదరాబాద్ జిల్లా ఆర్టీఓ శ్రీనివాస్ రెడ్డి, అంబర్‌పేట్ తహశీల్దార్ జ్యోతి పాల్గొన్నారు.