హైదరాబాద్

ఆల్ ఇన్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలోని కోటి మంది నిత్యం జీవనంతో ముడిపడి ఉన్న వివిధ ముఖ్యమైన ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఒక చోటకు తీసుకువచ్చేందుకు సర్కార్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం మహానగర ప్రజలకు అతి ముఖ్యమైన, అత్యవసరమైన సేవలను అందించే సిటీకి సంబంధించిన వివిధ కార్యాలయాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటన్నింటిని ఒకేచోటకు తీసుకువచ్చి, ఇంటిగ్రేటెడ్ ఆఫీసు భవన సముదాయాన్ని నిర్మించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా సిటీ సెంటర్‌లో ఉన్న ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలం ఇందుకు అనుకూలమని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైన భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు, డిజైన్లను సర్కారు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను కూల్చివేయాలని కూడా యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. హైదర్‌గూడలో ఇటీవలే నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ సరిపోతుందా లేదో అనే అంశంపై ఇటీవలే అధ్యయనం చేసినట్లు సమాచారం. కొత్తగా నిర్మించిన ఈ క్వార్టర్స్ కూడా అసెంబ్లీకి దగ్గరగా ఉండటంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సరిపోయేలా ఉండటంతో ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలంలో ఈ ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆఫీసెస్ కాంప్లెక్సును నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆదర్శ్‌నగర్‌లో కాంప్లెక్సును నిర్మిస్తున్న విషయంపై ఇప్పటికే ఇందులో ఉంటున్న పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు సమాచారం కూడా వచ్చినట్లు తెలిసింది. జన జీవనంతో ముడి పడి ఉన్న జలమండలి, జీహెచ్‌ఎంసీ, పోలీసు, విద్యుత్, రవాణా, వైద్యారోగ్యశాఖ వంటి విభాగాలకు సంబంధించి సిటీ ఆఫీసులను ఇక్కడ నిర్మించే ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల భవన సముదాయంలోకి మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణ ఏర్పడక ముందు ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆఫీసు కాంప్లెక్స్ నిర్మాణానికి బషీర్‌బాగ్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ స్థలాన్ని కేటాయించాలని సర్కార్‌కు అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎంటీ కృష్ణబాబు ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ, ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయినా, ప్రస్తుతం ప్రభుత్వం.. నగరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఒక చోట నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.