హైదరాబాద్

విద్యుత్తేతర పరిశ్రమలకు ఈ- ఆక్షన్‌తో సింగరేణి బొగ్గు అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద: దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్తేతర పరిశ్రమలకు ఈ- ఆక్షన్ పద్ధతిలో సింగరేణి బొగ్గును విక్రయించడానికి సింగరేణి యాజమాన్యం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రైవేట్ యామాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ పరిశ్రమలకు బొగ్గు అమ్మకాల కోసం సింగరేణి యాజమాన్యం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ ఒప్పందాల కారణంగా సింగరేణికి గణనీయమైన ఆదాయం రావడానికి వీలుకల్గుతుందని సింగరేణి యాజమాన్యం అభిప్రాయపడుతోంది. ఈ- ఆక్షన్ అమ్మకాలపై పరిశ్రమల యాజమాన్యాలతో ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని హైదరాబాద్ సింగరేణి భవనంలో ఏర్పాటు చేశారు. ఈ అవగాహన కార్యక్రమానికి కర్నాటక, ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన పెద్ద పరిశ్రమల వ్యాపారులు హాజరు అయ్యారు. సిమెంట్, పేపర్, క్యాపిటల్ పవర్ ప్లాంట్లు, ఎరువులు, మందులకు సంబంధించిన పరిశ్రమల యజమానులు సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు విద్యుత్తేతర రంగాలకు దాదాపు 107 లక్షల బొగ్గును విక్రయించారు. మరో 15 లక్షల టన్నుల బొగ్గును విక్రయించడానికి చర్చలు జరిపారు. గతంలో ప్రైవేట్ రంగాలకు చెందిన యజమానులు బొగ్గు కొనుగోలుకు ఢిల్లీ చుట్టూ తిరిగేవారన్నారు. బొగ్గు కొనుగోలు చేయాలంటే ఢిల్లీ నుంచి అనుమతుల కోసం ఎదురు చూసేవారన్నారు. బొగ్గు కేటాయింపు జరిగిందో? లేదో? తెల్సుకోవాలంటే నెలలు తరబడి చూడాల్సి వచ్చేదన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అధికారులు ఈ- ఆక్షన్ విధానాన్ని పూర్తిగా సరళీకరించారని సింగరేణి అధికారులు గుర్తు చేశారు. ఈ- ఆక్షన్‌లో ఎలా పాల్గొనాలి, ఎలా తమ ధరను పేర్కొనాలి అన్న అంశాలపై సింగరేణి అధికారులు వివరించారు. మరో విడతగా ఈనెల 16న 15 లక్షల టన్నుల బొగ్గు విక్రయించడానికి సన్నాహాలు చేస్తున్నామమని సింగరేణి మార్కెటింగ్ జీఎం ఆంటోని రాజా తెలిపారు.
ఈ సమావేశానికి ఐటీసీ, నవభారత్, సిర్పూర్ పేపర్ మిల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, డీవీఎస్, కేశోరాం సిమెంట్స్, ఆల్ట్రా సిమెంట్స్, మైహోమ్, భవ్య, రెయిన్ సిమెంట్స్ తదితర 29 పరిశ్రమల యజమానులు హాజరయ్యారు.