హైదరాబాద్

13న జాతీయ లోక్ అదాలత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: జాతీయ లీగల్ సర్వీసెస్ పిలుపు మేరకు 13వ తేదీన తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎ సంతోష్‌రెడ్డి చెప్పారు. లోక్‌అదాలత్‌లో క్రిమినల్, సివిల్ కేసులను పరిష్కరించుకోవచ్చని, కేసులు పరిష్కృతమైతే గతంలో చెల్లించిన కోర్టు ఫీజులను వారికి వెనక్కు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి లేదా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ల్లో ఉన్న న్యాయ సేవా సదన్‌లలో సంప్రదించాలని సూచించారు.