హైదరాబాద్

‘కేసీఆర్ సోషల్ ఇంజనీర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణలో భూములను సస్యశ్యామలం చేయడానికి ప్రాజెక్టుల నిర్మాణాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్ కాదని, సీఎం సోషల్ ఇంజనీర్ అంటూ రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అభివర్ణించారు. గురువారం తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ఇంజనీర్ల నుద్దేశించి మంత్రి వేముల మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజనీర్లది క్రియాశీలక పాత్ర అని ఆయన గుర్తు చేశారు. నిజాంసాగర్ నిర్మించి నవాబ్ అలీ జంగ్ రైతులకు ఎనలేని మేలు చేశారన్నారు. కర్షకుల జీవితాల్లో వెలుగు నింపడానికి సీఎం చేస్తున్న కృషిని భావితరాలు గుర్తు చేసుకుంటారన్నారు. నవాబ్ అలీ జంగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా మార్చడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.