హైదరాబాద్

బోనాలకు లాల్‌దర్వాజా ఆలయం ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో ఆషాడమాసంలో ఎంతో వైభవపేతంగా జరుపుకునే పండుగల్లో బోనాలు ప్రసిద్ధి. పాతబస్తీలోని పలు అమ్మవారి ఆలయాలను తీర్చిదిద్దుతున్నారు. ఆషాడమాసం ఆరంభంతో అమ్మవారి బోనాలు, జాతర, ఘటాల స్థాపన వంటి కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళీ దేవాలయం బోనాల ఉత్సవాలకు ముస్తాబవుతుంది. 110 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 111 వార్షికోత్సవ బోనాలు జాతర వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు ఆషాడ మాసంలో పది రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఇక్కడ నిర్వహించే బోనాల జాతరకు నగరం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రజలు ఆధిక సంఖ్యలో తరలి రానున్నారు.
ఈనెల 19న ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. మరుసటి రోజు సోమవారం రంగం కార్యక్రమం, అనంతరం ఘాటాల నిమజ్జన, సాముహిక ఊరేగింపు ఉంటుంది. ఆలయానికి రంగులు వేయడంతో పాటు రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వెండి తాపడాలకు పాలిష్ చేయడం వంటి ఇతర పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. ఆలయ పరసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు.
లాల్‌దర్వాజా బోనాల జాతర ఉత్సవాలకు ఆలయం వద్ద స్వాగత వేదిక, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆలయ కమిటీ కోరింది. ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతి నర్సింగ్ రావు, ఉపాధ్యక్షుడు కే.వెంకటేష్, కోశాధికారి జీ.అరవింద్ కుమార్ గౌడ్ ఖైరతాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ వి.శారద, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ.నర్సింగ్ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆలయం వద్ద విద్యుత్ అంతరాయం కలుగకుండా 11 రోజుల పాటు జనరేటర్లను అందుబాటులో ఉంచాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు.