హైదరాబాద్

కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లక్ష సీసీ కెమెరాలను ఒకేచోట కూర్చోని పర్యవేక్షించేందుకు వీలుగా బల్దియా ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూం శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఈ కంట్రోల్ రూంను స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్, సంయుక్త కార్యదర్శి వి.కే. జిందాల్ ప్రారంభించారు. కమిషనర్ దాన కిషోర్ కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ద్వారా ఎక్కడి పరిస్థితులనైనా ఈ కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షించే వెసులుబాటు కల్గిందని వివరించారు. ఈ పర్యవేక్షణతో నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ మెరుగుపడటంతో పాటు వర్షాకాలం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినపుడు, ఏదైనా వైపరీత్యాలు సంభవించినపుడు పరిస్థితులను నేరుగా సమీక్షించవచ్చునని తెలిపారు. అంతేగాక, జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలోని డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఇంజనీర్ల పనితీరును కూడా ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా నేరుగా పరిశీలించవచ్చునని తెలిపారు. దీంతోపాటు జీహెచ్‌ఎంసీ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చునని తెలిపారు. నగరంలో ఇప్పటికే పోలీసు శాఖ ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. తద్వారా మెరుగైన రోడ్ల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాలు, వర్షాలవల్ల ఏర్పడే నీటి నిల్వల ప్రాంతాలు, మురుగునీరు రహదారులపై పొంగటం ఇతర కార్యక్రమాలను నేరుగా సమీక్షించి, సమస్య పరిష్కారానికి వెంటనే కృషి చేసే అవకాశముంటుందని తెలిపారు.
జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన అత్యంత ఆధునిక కమాండ్ కంట్రోల్ విధానం దేశంలోనే మరే ఇతర మున్సిపల్ కార్పొరేషన్‌లో లేదని మేయర్ స్వచ్ఛ్భారత్ మిషన్ డైరెక్టర్ జిందాల్ అభినందించారు.
స్వచ్ఛ కార్యక్రమాల అమలు, నగర నిర్వాహణకు ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటును జిందాల్ ప్రత్యేకంగా ప్రశంసించారు.