హైదరాబాద్

దేశానికే సిటీ స్వచ్ఛ కార్యక్రమాలు ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్వచ్ఛ కార్యక్రమాలు అనేవి ఒక రోజు నిర్వహించేవి కావని, వీటిని నిరంతరం నిర్వహించాలని స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ వీకే జిందాల్ అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం స్వచ్ఛ హైదరాబాద్, నీటి సంరక్షణ, వాక్ తదితర కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా స్వచ్ఛత విషయంలో ఉన్నత ఫలితాలు లభించాయని, స్వచ్ఛ భారత్ కార్యక్రమం 2020లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని సూచించారు. ప్రతి ఇంట్లో పోగయ్యే చెత్తను ఇంట్లోనే తడి,పొడిగా వేర్వేరు చేయాలని సూచించారు. మెట్రో నగరాలన్నింటిలో హైదరాబాద్ నగరంలో స్వచ్ఛతపై వినూత్న కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్, సాఫ్, షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమాలతో స్థానిక ప్రజల పాల్గొనే తీరు కూడా అభినందనీయని అన్నారు. గురుగ్రామ్, న్యూఢిల్లీ, ఆగ్రా పట్టణాల్లో ఇంటింటి నుంచి చెత్త సేకరణ, తడి, పొడిగా వేర్వేరు చేయటం వంటి కార్యక్రమాలు నూటికి నూరు శాతం నిర్వహించేందుకు వీలుగా పైలట్ ప్రాజెక్టును చేపట్టామని వివరించారు. చెత్త సేకరణ వాహనాలు, వంద శాతం ఇళ్లను జీపీఎస్ ద్వారా అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నగరాన్ని ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్ ఫ్రీ నగరంగా, వార్డును, జోన్‌లను రూపొందించేందుకు ఇంటిగ్రేటెడ్ ఇటీ ప్రొఫైళ్లను రూపొందించుకోవాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో ఇచ్చే ర్యాంకింగ్‌ను దేశంలోని చిన్న నగరాలతో సమానంగా కాకుండా మెట్రో నగరాలకు ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ సమర్పించిన అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు జిందాల్ తెలిపారు.
‘స్వచ్ఛ’పై ప్రత్యేక దృష్టి
స్వచ్ఛ భారత్ సాధనకు కేంద్రం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో నగరానికి మెరుగైన ర్యాంకును సాధించుకునేందుకు నగరంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను తడి, పొడిగా వేర్వేరుగా సేకరించేందుకు వీలుగా ఇప్పటికే 44లక్షల డస్ట్‌బిన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేయటంతో పాటు భవన నిర్మాణ వ్యర్థాల ఏర్పాటు ప్లాంట్లు, జవహర్‌నగర్ డంప్ యార్డు క్యాపింగ్ పనులు, ఓపెన్ గ్యార్భెజీ పాయింట్ల ఎత్తివేత, నగరంలో స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణకు అధునాతన కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు, ఎల్‌ఈడీ లైట్ల ప్రాజెక్టు తదితర వినూత్న కార్యక్రమాలు హైదరాబాద్‌లో సమర్ధవంతంగా అమలు చేశారని మేయర్ వివరించారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొవటానికి జీహెచ్‌ఎంసీలో పూర్తిస్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయటంతో నగర భద్రతపై ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పారని తెలిపారు. కమిషనర్ దాన కిషోర్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయటంతో సంపూర్ణ స్వచ్ఛత సాధనకు సాఫ్ హైదరాబాద్ - షాన్‌దార్ హైదరాబాద్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇండోర్ నగరంలో మాదిరిగానే పలు స్వచ్ఛంద సంస్థలు, ఆస్కీ సంస్థ సహకారంతో చేపట్టామని తెలిపారు.