హైదరాబాద్

26న లాల్‌దర్వాజ అమ్మవారికి కనక దుర్గ దేవస్థానం పట్టు వస్త్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి ఈనెల 26వ తేదీన విజయవాడ కనకదుర్గ దేవస్థానం తరపున అధికారికంగా ఈఓ వీ.కోటేశ్వరమ్మ.. పట్టు వస్త్రాలు సమర్పిస్తారని లాల్‌దర్వాజా ఆలయ కమిటీ తెలిపింది. దుర్గమ్మ దేవాస్థానం ఈఓ కోటేశ్వరమ్మను ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు కే.వెంకటేష్, కోశాధికారి జీ.అరవింద్ కుమార్ గౌడ్ కలిసి 28న జరిగే లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. 26న హైదరాబాద్‌కు వస్తున్నానని అదే రోజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడంతో పాటు ఆరోజు ఆలయంలో జరిగే లక్ష కుంకుమార్చనలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఈఓ కోటేశ్వరమ్మ తెలిపారు.
అసమాన దేశీయ కళారూపం
‘చిందు యక్షగానం’
కాచిగూడ, జూలై 15: అసమాన దేశీయ కళారూపం ‘చిందు నృత్యం’ అని గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి అన్నారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సినారె, తెలంగాణ సాహితీ కిరణం దాశరథి కృష్ణమాచార్య జయంతోత్సవం సందర్భంగా శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ‘చిందు యక్షగాన’ మహోత్సవ వేడులను నిర్వహిస్తున్నామని వివరించారు. అంతరించిపొతున్న కళలను ప్రొత్సహించేందుకు గానసభ కృషి చేస్తుందని చెప్పారు. గతంలో సంపన్న వర్గాల నుంచి సామాన్య ప్రజల వరకు తెలంగాణ సమాజాన్ని ఎంతగానో ఆకట్టుకున్న అద్భుతమైన కళారూపం చిందు యక్షగానం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడిన తరువాత మరుగున్న పడిపోతున్న కళలకు వెలికితీసి కళలను కాపాడుతుందని తెలిపారు. తెలంగాణ కళలను పరిరక్షించేందుకు గానసభ ఆధ్వర్యంలో చిందు యక్షగాన మహోత్సవ వేడుకలను నిర్వహిస్తుందని చెప్పారు. గానసభలో కళాకారులను ప్రొత్సహించడానికి వేదికలను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన యక్షగాన కళాకారులు పాల్గొంటారని వివరించారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, జూలై 15: గాన గాంధర్వం సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి సోమవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర దిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలా చారి పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. కళలను కాపాడేందుకు కళా సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంస్థ అధ్యక్షుడు వేంకటేశ్వర రావు నిర్వహణలో గాయనీ, గాయకులు విజయ లక్ష్మీ, జోగరావు, ఫణి కిషోర్, లక్ష్మీ, పవిత్ర రెడ్డి, శ్రీనివాస రావు అలపించిన సినీ గీతాలు అలరించాయి.