హైదరాబాద్

అంబులెన్స్‌కు దారేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఎన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినా, ఆధునిక రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చినా ఫలితం
లేకుండాపోతోంది. న్యూ సిటీ మాట అలా ఉంచితే పాతబస్తీలో మాత్రం పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రావటం లేదు. భారీగా రోడ్ల విస్తరణ చేపట్టినా, వాహనాలపై రోడ్లపైకి వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. కనీసం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా వెళ్లేందుకు దారి ఉండటం లేదు. ముఖ్యంగా అఫ్జల్‌గంజ్ మొదలుకుని, పత్తర్‌గట్టి, మదీనా, చార్మినార్, బహద్దూర్‌పురా, ఖిల్వత్, మొఘల్‌పురా, ఛిత్రినాఖ, తలాబ్‌కట్టా, లాల్‌దర్వాజ, ఇంజన్‌బౌలీ, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పాదచారులు రాకపోకలు సాగించాల్సిన ఫుట్‌పాత్‌లు కబ్జాలపాలై కన్పిస్తున్నాయి. అంతేగాక, వాహనాల పార్కింగ్ కోసం మహానగర పాలక సంస్థ కేటాయించిన స్థలాన్ని సైతం కబ్జా చేసి కొందరు వ్యాపార సంస్థలను నిర్మించుకున్నా, కనీసం వారిని ప్రశ్నించేందుకు బల్దియా,ట్రాఫిక్ అధికారులు ప్రశ్నించేందుకు సాహసించటం లేదు. ఫుత్‌పాత్‌లు, రోడ్లు, పార్కింగ్ స్థలాలు కబ్జా పాలవుతున్నా, చూసీచూడనట్టుగా వ్యవహారిస్తున్నారు. ట్రాఫిక్‌పై స్థానికుల్లో నెలకొన్న అవగాహన రాహిత్యం, పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల స్వార్థం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో కనీసం 108 అంబులెన్స్ కూడా సకాలంలో చేరుకోలేని దుస్థితి ఏర్పడింది. ఫలితంగా పాతబస్తీ మొదలయ్యే అఫ్జల్‌గంజ్ చౌరస్తా మొదలుకుని బార్కాస్ వరకు అడుగడుగునా ట్రాఫిక్ జాం అవుతుంది. అసలే ఇరుకురోడ్లు, ఆపై రోడ్డుకిరువైపులా అక్రమంగా పలు వ్యాపార సంస్థల పార్కింగ్, అంతో ఇంతో మిగిలిన ఫుట్‌పాత్‌పై కూడా వ్యాపార సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం రద్దీగా, ఇరుకుగా ఉండే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుచేసినా, ఎవరూ వాటిని పట్టించుకోకుండా ప్రయాణిస్తుంటారు. ఫలితంగా చిన్న ప్రమాదాలు జరిగి, వాటి ద్వారా పాతబస్తీలో శాంతిభద్రతలకే విఘాతం కలిగే ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో వేల సంఖ్యలో తోపుడు బండ్లు ఉంటాయి. రాజకీయ వత్తిళ్ల కారణంగానే ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించకపోవటం వల్లే విస్తరించిన రోడ్లు కబ్జా పాలు కావటంతో కనీసం అంబులెన్స్ కూడా దారి దొరకటం లేదు. జరగరాని ఘటనలేమైనా జరిగి, ఎవరైనా గాయపడితే క్షతగాత్రులను తరలించేందుకు కనీసం అంబులెన్స్‌కైనా దారి ఉండేలా చూసుకోవల్సిన బాధ్యత పాతబస్తీలోని ప్రతి ఒక్కరిపై ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చినుకు పడితే అంతటా ఇదే సీను
చినుకుపడితే చాలు రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడే నిల్చిపోతాయి. గంటకు రెండు సెంటీమీటర్లకు మించి వర్షం కురిస్తే ఇక సిటీ అతలాకుతలమే. పాతబస్తీలో సాధారణ పరిస్థితుల్లో ట్రాఫిక్ జాం అయితే, న్యూ సిటీలో చినుకుపడిందంటే చాలు కనీసం అంబులెన్స్ కూడా వెళ్లేందుకు దారి ఉండటం లేదు. ఒకవైపు రోడ్డుపై భారీగా నీరు నిల్వటం, వీది ధీపాలు వెలగకపోవటం, ఎక్కడ గుంతలున్నాయో తెలియక పోవటం, చెట్లు విరిగి పడటం, కరెంటు తీగలు తెగి పడటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.