హైదరాబాద్

సినారె చిరస్మరణీయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : పద్మభూషణ్ డా.సీ.నారాయణ రెడ్డి చిరస్మరణీయుడని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కీర్తించారు. సినారె జయంతి సందర్భంగా ప్రముఖ కవి, విమర్శకుడు ఆచార్య జీ.చెన్నకేశవ రెడ్డికి ‘సినారె సాహితీ’ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం రసమయి ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోశయ్య పాల్గొని చెన్నకేశవ రెడ్డికి పురస్కారం ప్రదానం చేశారు. సినారె రచయితగా, కవిగా, సినీ గేయ రచయితగా ఎంతో ఖ్యాతి సంపాధించుకున్నారని పేర్కొన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కూమార్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ సాహితీవేత్త డా.తిరుమల శ్రీనివాసా చార్య, రచయిత డా.అమ్మంగి వేణుగోపాల్, కళారత్న అవార్డు గ్రహీత ఎంకే ఆశాలత, రసమయి అధినేత డా. ఎంకే రాము పాల్గొన్నారు.
ఆకట్టుకున్న బోనాల వేడుకలు
కాచిగూడ, జూలై 16: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో స్వరమాధురి సాంస్కృతిక సేవా సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘బంగారు తెలంగాణ బోనాల వేడుకలు’ మంగళవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి మల్కాజ్‌గిరి న్యాయమూర్తి బూర్గుల మధుసూదన్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, చేనేత వర్గాల చైతన్య వేదిక అధ్యక్షుడు డా.చిక్కాదేవదాసు, గాయనీ చంద్రజ్యోతి పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. కళాకారులు హరిణి, గ్రీష్మ ప్రదర్శించిన జానపద నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ గాయనీ, సంస్థ అధ్యక్షురాలు సాయి పావని నిర్వహణలో గాయనీ, గాయకులు అలపించిన సినీ గీతాలు అలరించాయి.
తెలుగు సాహిత్య శిఖరం ‘దివాకర్ల’
కాచిగూడ, జూలై 16: తెలుగు సాహిత్య శిఖరం దివాకర్ల వేంకట అవధాని అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. ప్రముఖ సాహితీవేత్త దివాకర్ల వేంకట అవధాని జయంతి సభ మంగళవారం శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వకుళాభరణం కృష్ణమోహన రావు పాల్గొని దివాకర్ల వేంకట అవధాని చిత్ర పటానికి నివాళి అర్పించారు. తెలంగాణలో తన సాహిత్య ప్రసంగాల ద్వారా ప్రజలను ఉత్తేజితులను చేశారని పేర్కొన్నారు. ప్రముఖ చరిత్రక నవలా చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ మాట్లాడుతూ అవధాన విద్యలో అద్భుత ప్రతిభను కనబరిచారని తెలిపారు. పరిశోధకుడిగా, విమర్శకుడిగా, కవిగా, రచయితగా అవధానిగా విభిన్నమైన ప్రక్రియాల్లో తన రచనలు చేశారని వివరించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించగా సంగీత ఉపాధ్యాయురాలు సంయుక్త పాల్గొన్నారు.