హైదరాబాద్

అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయటంతో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంజనీరింగ్ మాన్సూన్ బృందాలు, అర్బన్ బయోడైవర్శిటీ, ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా కమిషనర్ దాన కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కురిసిన వర్షం కారణంగా నగరంలోని 50 ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడినట్లు, వాటిని తొలగించి ట్రాఫిక్‌కు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ బృందాలను రంగంలో దింపినట్లు కమిషనర్ వెల్లడించారు. రాజ్‌భవన్ రోడ్, అసెంబ్లీ, హిమాయత్‌నగర్, మాదాపూర్, బంజారాహిల్స్, అంబర్‌పేట, ఐఎస్ సదన్, యాకుత్‌పురా, టోలీచౌకీ, షేక్‌పేట, అమీర్‌పేట, శ్రీనగర్‌కాలనీ, ఎల్‌బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచినట్లు ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా భారీగా వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతానికి సమీపంలో అందుబాటులో ఉన్న మాన్సూన్ బృందాలకు అక్కడికి పంపుతూ సహాయక చర్యలు చేపట్టినట్లు కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. మంగళవారం కురిసిన వర్షం కారణంగా సీతాఫల్‌మండి సమీపంలోని మార్కెట్ నాలాలో వర్షపు నీరు భారీగా చేరుతోంది. అయితే నీటి ప్రవాహనికి రిలయన్స్ కేబుల్ అడ్డంగా ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది ఆ కేబుల్‌ను కట్ చేసి, నీరు సజావుగా ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు.