హైదరాబాద్

బిగ్‌బాస్ షోను రద్దుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : మహిళల పట్ల అసభ్యప్రవరిస్తూ చిత్రీకరణ చేస్తున్న బిగ్‌బాస్ షోను తక్షణమే రద్దుచేయాలని జర్నలిస్టు శే్వతారెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ల ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఓయు విద్యార్ధి సంఘం నాయకులు దయాకర్, శంకర్, ప్రేమ్‌లతో కలిసి మాట్లాడారు. బిగ్‌బాస్ కార్యక్రమ కో-ఆర్డినేటర్లు షోకు ఎంపిక చేసే సమయంలోనే మహిళలు, యువతులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై తాము మహిళా ఎంపీలకు, జాతీయ మహిళా కమిషన్, బంజారాహిల్స్, రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
శ్రీనివాస్‌కు 23న ఆత్మీయ సత్కారం
కాచిగూడ, జూలై 20: పద్మభూషణ్ డా సీ నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ప్రముఖ గాయకుడు ఎం. శ్రీనివాస్‌కు ఆత్మీయ సత్కర కార్యక్రమం రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్, శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదిన గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీ సుబ్బాలక్ష్మీ, ఎంవీ రమణకుమారి తెలిపారు. గానసభలో విలేఖరులతో మాట్లాడుతూ శ్రీనివాస్ బాల్యం నుంచే పాటలను అత్యంత ఆసక్తిగా అభ్యసించి సినీ, లలిత గీతాలను అలవోకగా అలపించే మధుర గాయకుడు అని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత ఆచార్య ఎన్.గోపీ, ప్రముఖ సినీ నటుడు గిరిబాబు, భీమన్న సాహితీ నిధి అధ్యక్షురాలు హైమవతి భీమన్న, గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి పాల్గొంటారని తెలిపారు.