హైదరాబాద్

ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : అగ్రవర్ణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈబీసీ రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని తెలుగు పీపుల్ ఎకనామికల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ (టీ-ఈబీసీఏ) డిమాండ్ చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అధ్యక్షుడు విజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి మాట్లాడారు.
ఎన్నో పోరాటాల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈబీసీ రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. చట్టం వచ్చి నెలలు గడుస్తున్న రాష్ట్రంలో అమలు కాకపోవడంతో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం సూచించిన విధంగా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రావణ్ కుమార్, లహరి, నరేందర్ రెడ్డి, లోకేష్ రెడ్డి పాల్గొన్నారు.

లలిత సంగీతానికి ఆదరణ
కాచిగూడ, జూలై 21: లలిత సంగీతానికి ఎంతో ఆదరణ ఉందని అన్నమాచార్య ప్రాజెక్టు వ్యవస్థాపక సంచాలకుడు కామిశెట్టి శ్రీనివాసులు అన్నారు. నవ్య నాటక సమితి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో 23వ ఏవీ సావిత్రి ‘లలిత సంగీత’ పోటీలను ఆదివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామిశెట్టి శ్రీనివాసులు పాల్గొని ప్రసంగించారు. భావగీతాలు, భక్తి గీతాలు, జోల పాటలు, కార్మికులు, కర్షకులు పాడుకునే పాటలు లలిత సంగీతంలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో గాయనీ స్నేహ లతామురళి, ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి యువీఎల్ ఆనంద, గాయనీ మల్లాది కార్తిక త్రివేణి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు వేమరాజు విజయ్ కుమార్, ఆర్.సుధారాణి, బీఎస్ శ్రీనివాస రావు, హనినాథ్ బాబు పాల్గొన్నారు.