హైదరాబాద్

వైభవంగా ఉజ్జయిని మహాంకాళి బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట : తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర కన్నుల పండువగా జరిగింది. లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ పాడిపంటలతో అందరూ సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న నిలబడి పోరాడే మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని అమ్మవారిని వేడుకున్నట్టు ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించేలా తోడ్పాటును అందించాలని కోరుకున్నట్టు చెప్పారు. అమ్మవారి బోనాలు ప్రారంభం కాగానే వర్షాలు కురియడం ఎంతో శుభపరిణామమని అన్నారు.
పత్యేక ఏర్పాట్లు: తలసాని
మంత్రి తలసాని మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకునే సమయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. బోనాల కోసం రెండు క్యూలైన్లను ఏర్పాటు చేసి, క్యూలైన్‌లోకి ప్రవేశించిన అరగంటలోపే బోనాలు సమర్పించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసారని తెలిపారు. జాతరను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేశారని అన్నారు.
అమ్మవారు తీర్చారు
* మంత్రి శ్రీనివాస్ గౌడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, స్వయం పాలన కావాలని కోరుకున్న మొక్కులని అమ్మవారు తీర్చారని, వచ్చే ఏడాదిలోపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి అయి పరివాహక ప్రాంతాల ప్రజలు సుఖంగా జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. ఇటీవల ఏటిగడ్డ ప్రాజెక్టు పూర్తి కావడంతో 50లక్షల ఎకరాల సాగునీరు అందుతుండటంతో ప్రాంత ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పారు.
అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి
* ఎంపీ రేవంత్ రెడ్డి
ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వేడుకున్నట్టు చెప్పారు. జాతరలో అమ్మవారి దర్శనం కోసం వచ్చే చివరి భక్తుడు కూడా అసౌకర్యానికి గురికాకుండా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.
అచ్చమైన తెలంగాణ పండుగ
* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బోనాల జాతర అంటే అచ్చమైన తెలంగాణ పండుగ, పల్లె ప్రజలు పట్నానికి కదిలి అందరూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకుంటూ సాగే ఉత్సవం అన్నారు. మాజీ ఎంపీ హనుమంత రావు మాట్లాడుతూ తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది బోనాల ఉత్సవాలు మహిళలను ఎంతో గౌరవించుకుంటామని, ఇలాంటి చోట బిగ్‌బాస్‌లాంటి షోలతో మహిళలను అగౌరవపరిచేలా రియాలిటీషోలు జరుగుతుండటం విచారకరమని, వెంటనే బిగ్‌బాస్‌షోను నిలిపివేయాలని కోరారు. అన్నమయ్య, భక్తరామదాసు చిత్రాల్లో నటించిన నాగార్జునపై తెలుగు ప్రజలకు అపారగౌరవం ఉందని, అలాంటి బిగ్‌బాస్ షోను నడిపించడం సరికాదని అన్నారు.
పటిష్ట బందోస్తు
బోనాల వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, నార్త్‌జోన్ డీసీపీ కల్నేశ్వర్‌తో కలిసి క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. వీవీఐపీ, వీఐపీల రావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
బంగారు బోనం
ఆదయ్యనగర్‌లోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి నుంచి బంగారు బోనాన్ని ఉరేగింపుగా తీసుకువచ్చి మహంకాళి అమ్మవారికి సమర్పించారు. ఆదయ్యనగర్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు సిటీలైట్ హోటల్, మోండా మార్కెట్, బాటా మార్గంలో మంగళవాయిద్యాలు, డప్పుమోతలు, పోతురాజుల విన్యాసాలతో అమ్మవారి దేవాలయానికి తీసుకువచ్చారు. అమ్మవారికి 108 బోనాలను మాజీ ఎంపీ కవిత సమర్పించారు.
పలహారం బండ్ల ఊరేగింపు
ఆదివారం సాయంత్రం అమ్మవారి దేవాలయానికి పోటాపోటీగా పలహారం బండ్ల ఉరేగింపును నిర్వహించారు. కన్నులపండువగా ఉరేగింపు కొనసాగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌తో పాటు మాజీ కార్పోరేటర్ సీలం ప్రభాకర్.. మహంకాళి దేవాలయ పరిసర ప్రాంతాల్లోని కళాసిగూడాకు చెందిన భర్తన్‌దొడ్డి బర్గ ప్రశాంత్ ముదిరాజ్, ఆంజనేయులుతో పాటు వివిధ సంఘాల ఆధ్వర్యంలో పలహారం బండ్ల ఊరేగింపు కొనసాగింది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల, డప్పుచప్పుళ్లతో అమ్మవారి దేవాలయానికి ఊరేగింపుగా పలహారం బండ్లను తీసుకువచ్చారు.
నేడు రంగం
సోమవారం ఉదయం అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. అవివాహిత మహిళ రంగం జోస్యం వినిపిస్తారు. అనంతరం అమ్మవారిని అంబారిపై ఊరేగింపు కొనసాగుతుంది. సికింద్రాబాద్ పురవీధుల మీదుగా మెట్టుగూడ వరకు ఊరేగింపు కొనసాగుతుంది.