హైదరాబాద్

కళలను కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాలని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. పద్మభూషణ్ డా.సీ.నారాయణ రెడ్డి, మహాకవి దాశరథి జయంతి సందర్భంగా శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ‘చిందు యక్షగాన’ మహోత్సవ కార్యక్రమం సోమవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోశయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి చిందు యక్షగాన మహోత్సవాన్ని ప్రారంభించారు. మరుగున్న ఉన్న కళలను వెలికితీసి ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. చిందు యక్షగానం వారం రోజుల పాటు ఏర్పాటు చేయడం సంతోషదాయకమని పేర్కొన్నారు. పిల్లిట్ల సంజీవయ్య బృందం ప్రదర్శించిన ‘శశిరేఖా పరిణయం’ చిందు యక్షగానం ఆకట్టుకుంది. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో మల్కాజ్‌గిరి న్యాయమూర్తి జస్టిస్ బూర్గుల మధుసూదన్, విజయ్ కుమార్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా.గడ్డం మోహన రావు పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, జూలై 22: సప్తస్వర మాలిక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ‘మధుర గీతాల’ సినీ సంగీత విభావరి సోమవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. ప్రముఖ గాయకుడు మురళీధర్ నిర్వహణలో గాయనీ, గాయకులు టీవీ రావు, గణపతి రాజు, లలిత, సుజాత, వసంత లక్ష్మీ, అరుణ, రాధిక, సంపత్ అలపించిన సినీ గీతాలు అలరించాయి.
ఉద్యమ కవి దాశరథి
కాచిగూడ, జూలై 22: నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఉద్యమ మహాకవి దాశరథి అని తెలుగు టెలివిజన్ రచయిత సంఘం అధ్యక్షుడు సురేష్ కుమార్ అన్నారు. మహాకవి దాశరథి జయంతి సందర్భంగా గాయకుడు బాపిరాజు నిర్వహణలో దాశరథి చిత్ర గీతాంజలి కార్యక్రమం కళానిలయం సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సురేష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో దశారథి సాహిత్యం ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. చేనేత వర్గాల చైతన్య వేదిక అధ్యక్షుడు డా.చిక్కా దేవదాసు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, డా.కే.రాములు, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సురేందర్, పుష్పలత పాల్గొన్నారు.