హైదరాబాద్

అంబారీపై అమ్మోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట : రంగం కార్యక్రమం తర్వాత అమ్మోరిని శ్రీ మహంకాళీ దేవాలయ పురవీధుల్లో అంబారీపై ఊరేగించారు.
జూపార్కులోని అంబారీ అనారోగ్యంతో బాధపడుతున్నందున ఈ సారి అంబారీని కర్ణాటక నుంచి తీసుకువచ్చారు. కొత్త అంబారీ కావటంతో అంబారీ ఎలా స్పందిస్తుందో తెలియకపోవటంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆలయం నుంచి బల్దేరిన అమ్మోరి శోభయాత్ర బాటా, అల్ఫాహోటల్, అమ్మోరి అమ్మగా వెలిసిన మెట్టుగూడలోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయం వరకు కొనసాగిన ఈ యాత్రలో వివిధ వీధుల్లో భక్తులు, అమ్మోరిని దర్శించుకుని, సాకలు పెట్టి, మొక్కులు చెల్లించుకున్నారు.
అంబారీపై ఆమ్మోరు ఊరేగుతున్నపుడు, ముందు విజయవాడ కళాకారుల నృత్యాలు, బంజారాల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందలాదిగా పాల్గొన్న భక్తులను ఈ నాట్య వినాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
బోనాల ఉత్సవాల్లో భాగంగా యువకులను ప్రత్యేకంగా ఆకర్షించే ఫలహారం బండ్ల ఊరేగింపులు సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళీ బోనార జాతరలో డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌లు పోటాపోటీగా నిర్వహించాయి. వివిధ కుల, సంఘాలు, దేవాలయా కమిటీల ఆధ్వర్యంలో కూడా సోమవారం ఫలహారం ఊరేగింపులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి.