హైదరాబాద్

ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తత అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆన్‌లైన్ మోసాల పట్ల నేటి యువతరం అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. వ్యక్తిగత వివరాలు, ఫోటోలు భద్రంగా ఉంచుకోవాలని, నేరగాళ్లు అంతర్జాలాన్ని దర్వినియోగం చేస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని సీపీ పేర్కొన్నారు. సైబర్ మోసాలకు గురైన వారేవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. సామాజిక మాద్యమాల వినియోగంలో మహిళలు, యువతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఖైరతాబాద్‌లోని విశే్వశ్వరయ్య భవన్‌లో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సామాజిక మాద్యమాల వినియోగంపై అవగాహన లేకపోవడంతో సామాన్య ప్రజలు సైబర్ మోసాలబారిన పడి నష్టపోతున్నానరని చెప్పారు. సైబర్ సేఫ్ హైదరాబాద్‌గా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతర్జాలం, సామాజిక మాధ్యమాల వినియోగంలో మహిళలు, యువతి, యువకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిటీ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సైబర్ నిపుణుడు రక్షిత్ టాండన్ మాట్లాడుతూ సైబర్ మోసాల జరిగే తీరుపట్ల అవగాహన కల్పించారు. నగరంలో మహిళ, యువతీల భద్రత కోసం షీ టీమ్స్ అనేక కార్యక్రమాలు చేపడుతుందని సీపీ వివరించారు.