హైదరాబాద్

పాతబస్తీలో పర్యటించిన సీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్.. నగర పోలీసు అదనపుకమిషనర్ డీఎస్ చౌహన్, జాయింట్ కమిషనర్‌లు తరుణ్ జోషి, అవినాష్ మహంతితో పాటు పలువురు డీసీపీలతో కలిసి మంగళవారం విస్తృతంగా పర్యటించి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, ఘాటాల ఊరేగింపు రూట్‌ను పరిశీలించారు. లాల్‌దర్వాజా సింహవాహినీ శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ చైర్మన్ తిరుపతి నర్సింగ్ రావు, ఉపాధ్యక్షడు కే.వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బీ.మారుతి యాదవ్, కోశాధికారి జీ.అరవింద్ గౌడ్.. ఆలయం పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తుపై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. బోనాల పండుగా రోజు, మరుసటి రోజు నిర్వహించే అమ్మవారి ఘటాల సాముహిక ఊరేగింపు రోజు ట్రాఫిక్ మళ్లింపుతదితర అంశాలపై చర్చించారు. పాతబస్తీలోని వివిధ అమ్మవారి ఆలయాల ప్రతినిధులతో కలిసి సీపీ దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ మాట్లాడుతూ పాతబస్తీలో నిర్వహించే బోనాలు జాతర వేడుకలు అంగ రంగా వైభవంగా ప్రశాంతంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. బోనాలు, జాతర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. వేడుకల్లో ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండటానికి వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రశాంతంగా బోనాలు నిర్వహించడంతో హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. బోనాలు జరిగే ఆలయల వద్ద ప్రత్యేక పోలీసు నిఘాను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పాతబస్తీ చార్మినార్, షాలిబండలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళీ దేవాలయం, లాదర్వాజా, గౌలిపురా, ఉప్పుగూడ, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లోని దేవాలయాలను సీపీ సందర్శించారు. బోనాలు జాతర వేడుకలు ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటు ప్రజలు పోలీసులకు సహకరించాలని అన్నారు.
* ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
తెలంగాణ గజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రతినిధులు మంగళవారం లాల్‌దర్వాజా సింహవాహిణి శ్రీమహంకాళీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఏ.సత్యనారయణ, ప్రతినిధులు పీ.రవిందర్ కుమార్, డీ.అరుణ్ కుమార్, ఎంబీ కృష్ణ యాదవ్, జీ.వెంకటేశ్వర్లు, బీ.వెంకటయ్య, బీ.ప్రభాకర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతి నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి బీ.మారుతి యాదవ్, ఉపాధ్యక్షుడు వెంకటేష్ తదితరులు కలిసి ఘనంగా సత్కరించారు.