హైదరాబాద్

రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేయడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 24: రోహిత్ వేముల ఆత్మహత్యను రాజకీయం చేయడం సరికాదని ప్రొఫెసర్ గాలి వినోద్ అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటనపై మీడియేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని తాను కోర్టులో పిల్ వేసినట్టు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సుమారు 1500 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించని రాహుల్, ఎంఐఎం నాయకులు ఈ విషయంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. తాను బిజెపికి అనుకూలంగా మాట్లాడుతున్నానని అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని చెప్పారు. దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ రాజ్యాంగ బద్దంగా జీవించాలని, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తామనడాన్ని తాము సమర్ధించమని, అదే సమయంలో దళితుల హక్కులకు భంగం కలిగేలా వ్యవహరిస్తే ఊరుకోబోమని వివరించారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో జరుగుతున్న పరిణామాలపై పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సి ఉందన్నారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయ కోణంలో కాకుండా విద్యార్థుల సమస్యగా, అణగారిన వర్గాల సమస్య గుర్తించి న్యాయం జరిగేలా చూడాలని జయ వింధ్యాల కోరారు.