హైదరాబాద్

27న కార్పొరేట్ విద్యా సంస్థల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : కార్పొరేట్ అధ్యాపకులు, సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న కార్పొరేట్ విద్యా సంస్థలను బంద్ చేయనున్నట్టు తెలంగాణ లెక్చరర్స్ జేఏసీ తెలిపింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, బీజేపీ నేత శ్రీ్ధర్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఏ సంస్థ అయినా ప్రభుత్వం అయినా చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ధన సంపత్తికి లోబడి పనిచేస్తుందని విమర్శించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో లెక్చరర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం హామీలను మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులతో పాటు అందులో పనిచేస్తున్న లెక్చరర్లు, సిబ్బంది తీవ్ర మనోవేదకు గురి అవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు భాస్కర్ రెడ్డి, విల్సన్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

తాజ్‌కృష్ణలో సూత్ర ఎగ్జిబిషన్
ఖైరతాబాద్, ఆగస్టు 19: యువ డిజైనర్ల ప్రతిభను వెలికి తీసేందుకు తాజ్‌కృష్ణలో సూత్ర ఎగ్జిబిషన్ కొలువుదీరింది. రెండు రోజుల పాటు కొనసాగే ప్రదర్శనను నటుడు రాజశేఖర్ కుమార్తె యువనటి శివాత్మిక జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంతో డిజైనరీ రంగంలోకి వస్తున్న వారు తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం వివిధ రకాల దుస్తులు ధరించి ప్రదర్శించారు.