కృష్ణ

ముహూర్తం ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కృష్ణాజిల్లాను ప్రపంచ పటంలో నిలిపే గుల్లలమోద క్షిపణి పరీక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు ముహూర్తరం ఖరారైంది. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో నాగాయలంక మండలం గుల్లమోద గ్రామంలో నిర్మించనున్న క్షిపణి పరీక్ష ప్రయోగ కేంద్రం శంకుస్థాపన తేదీ ఖరారైంది. ఈ నెల 26వతేదీన ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన రాళ్లు పడనున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ చేతుల మీదుగా జరిగే శంకుస్థాపన మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్ ఇంతియాజ్ తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రక్షణ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు శంకుస్థాపన మహోత్సవానికి రానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ శాఖాధికారులు నాగాయలంకలో హెలీప్యాడ్ ఏర్పాటుకు సంబంధించిన పనులను పరిశీలించాలన్నారు. నాగాయలంక జెడ్పీ హైస్కూలు ఆవరణలో బహిరంగ సభ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధాన వేదికపై ప్రొటోకాల్ ప్రకారం సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణాజిల్లా ప్రపంచపటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. హెలీప్యాడ్ నుండి క్షిపణి ప్రయోగ కేంద్ర శంకుస్థాపన పైలాన్ నిర్వహించే ప్రాంతానికి, పైలాన్ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ నిర్వహించే జెడ్పీ హైస్కూల్‌కు రహదారి, బారికేడింగ్ పనులను తక్షణమే చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత, డీఆర్‌డీఓ అడిషనల్ చీఫ్ ఇంజనీర్ కల్నల్ ఎంజి తిమ్మయ్య, ఇఇ ఎం వర ప్రసాద్, డీఆర్‌ఓ ఎ ప్రసాద్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఎం చక్రపాణి, ఆర్డీవో ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.