హైదరాబాద్

ట్యాక్స్ కలెక్షన్‌లో ఏబీసీ దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగర పాలక సంస్థ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ వ్యవహారం దోచుకున్నోడి దోచుకున్నంతగా తయారైంది. ఒకవైపుకార్పొరేషన్ పీకల దాకా ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా, ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిన సిబ్బంది వారి తెలివితేటలను ఉపయోగిస్తూ, అందినంత దోచుకుంటున్నారు. పన్నును వసూలు చేసే సిబ్బందిలో కొందరు ప్రైవేట్‌గా అసిస్టెంట్ బిల్ కలెక్టర్(ఏబీసీ)లను నియమించుకుని పన్ను చెల్లింపుదారులను, ఇంటి యజమానులను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలకు రూ.పదివేల నుంచి రూ.పదిహేను వేల వరకు జీతాలు చెల్లిస్తూ కొంత దేహాధారుడ్యం కలిగిన యువకులను అసిస్టెంట్ బిల్ కలెక్టర్లుగా అక్రమంగా, అనధికారికంగా నియమించుకుంటూ ట్యాక్స్ దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు అసలు విధులకే హాజరుకాకుండా అసిస్టెంట్ బిల్ కలెక్టర్లతోనే పనులు చక్కబెడుతున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా నిర్మించే భవనాలు, అదనంగా అంతస్తులు నిర్మిస్తున్న భవనాలు, కమర్షియల్ భవనాలు, రెసిడెన్షియల్ భవనాలకు కమర్షియల్ పన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసి, తొలుత వారిని భయాందోళనకు గురి చేసి, ఆ తర్వాత పన్ను తగ్గిస్తే మాకేమిటీ? అంటూ బహాటంగా చెబుతూ బేరం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. అసలైన ట్యాక్స్ సిబ్బంది కొందరు.. అసిస్టెంట్ బిల్ కలెక్టర్ జారీ చేసిన నోటీసులకు స్పందించిన వచ్చే యజమానులతో ఒక చోట కూర్చోని సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. వర్తమాన సంవత్సరం జీహెచ్‌ఎంసీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది టార్గెట్‌గా పెట్టుకున్న రూ.1800 కోట్ల ఆస్తిపన్ను కలెక్షన్ చేసేందుకు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి ట్యాక్స్ సిబ్బందికి నెలవారీ టార్గెట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే! క్షేత్ర స్థాయిలో ట్యాక్స్‌ను కలెక్షన్ చేసే కొందరు అక్రమార్కులైన అధికారులకు ఇదే వరంగా మారింది. కొత్తగా నిర్మితమవుతున్న భవనాలను కూడా ఆస్తిపన్ను పరిధిలోకి తీసుకురావాలని కచ్చితమైన ఆదేశాలు ఉండటంతో తొలుత లేనిపోని నిబంధనలు చూపుతూ ఎడాపెడా లక్షల్లో పన్నును వడ్డిస్తూ నోటీసులు జారీ చేస్తారు. వీరి వడ్డనకు గుండె ఆగినంత పనికావటంతో అంత పెద్ద మొత్తంలో చెల్లించలేమంటూ, పన్ను తగ్గించాలని బ్రతిమాలుకుంటున్నారు. ఈ క్రమంలో పన్ను తగ్గించేందుకు లక్షలు, వేల రూపాయల్లో అమ్యామ్యాలు డిమాండ్ చేస్తున్నారు. పన్ను రూపంలో బల్దియా ఖజానాకు రావల్సిన పెద్ద మొత్తాన్ని ఈ ప్రైవేటుగా నియమితులైన ఏబీసీలు, ట్యాక్స్ సిబ్బంది జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. బడా వ్యాపార సంస్థలు, హోటళ్లు, మెస్‌లు, హాస్టళ్లతో పాటు రెసిడెన్షియల్ ఇళ్లను కూడా వదలటం లేదనే ఆరోపణ ఉలున్నాయి.
ఏసీబీకి పట్టుబడుతున్నా.. మారని తీరు
గడిచిన ఇరవై రోజుల్లో బల్దియా ట్యాక్స్ విభాగంలో పనిచేసే నలుగురు అధికారులు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడినా, మిగిలిన వారిలో కనీసం భయం కూడా కన్పించటం లేదు. ఎవరికివారు తామెంతో తెలివిగా దోచుకుంటున్నామని ఫీలవుతున్నారు. ఇటీవల ఎల్‌బీనగర్ సర్కిల్‌లో ఓ బిల్ కలెక్టర్ పన్నును తగ్గించేందుకు ఏకంగా రూ.80వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. అయినా వీరి పనితీరులో మార్పు రాకపోవటానికి ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోకపోటమే కారణమనే వాదనలు ఉన్నాయి.