హైదరాబాద్

త్వరలో మరో రూ.200 కోట్ల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో చేపడుతున్న ఎస్‌ఆర్‌డీపీ పనుల నిర్వహణకు మరో రూ. 200 కోట్లను బాండ్ల రూపంలో సేకరించేందుకు మరో రెండు నెలల్లో మళ్లీ బిడ్డింగ్‌కు వెళ్లనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ మూడో విడతగా బాండ్ల రూపంలో వంద కోట్ల రూపాయలను సేకరించేందుకు మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియను మేయర్, కమిషనర్ దాన కిషోర్, అదనపు కమిషనర్లు సిక్తా పట్నాయక్, జయరాజ్ కెనడీ, మున్సిపల్ పరిపాలన శాఖ సలహాదారు జయశ్రీ, ఎస్‌బీఐ కార్ప్స్, బీఎస్‌ఈ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ గ్రేటర్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు, పటిష్టమైన జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసిన తర్వాతే జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలు విశ్వాసంతో ట్రేడింగ్‌లో పాల్గొన్నాయని వివరించారు.
బ్యాంక్ వడ్డీ కంటే తక్కువ వడ్డీతో వంద కోట్ల రూపాయలను సేకరించామని తెలిపారు. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ మందకొడిగా ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ బాండ్లకు మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఇప్పటికే రెండు విడతలుల్లో రూ.395 కోట్లను సేకరించి జీహెచ్‌ఎంసీ రికార్డు సృష్టించిందని వెల్లడించారు. మరోసారి రూ.305 కోట్లను సేకరించాలని భావించినా, స్టాక్ మార్కెట్‌లో ఏర్పడ్డ మాంద్యంతో కేవలం రూ.100 కోట్లు మాత్రమే సేకరించామని తెలిపారు. మరో రెండు నెలల్లో మిగిలిన రూ.200 కోట్లను సేకరించనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థలు ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలతో దేశంలోని ఏ మున్సిపల్ కార్పొరేషన్ కూడా బాండ్లకు వెళ్లే అవకాశం లేదని, ఈ ఘనతను జీహెచ్‌ఎంసీ మాత్రమే సాధించిందని వివరించారు. ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసినట్లు తెలిపారు. సేకరించిన నిధులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీలను చెల్లిస్తూ పది సంవత్సరాల్లో సేకరించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని రామ్మోహన్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ మాట్లాడుతూ బాండ్లతో నిధులను సేకరించటానికి ఎస్‌బీఐ కార్ప్స్ సంస్థ ప్రధాన సలహాదారుగా వ్యవహారిస్తుందని, నేడు నిర్వహించిన బిడ్డింగ్‌కు స్పందన వచ్చిందని తెలిపారు. బాండ్లతో నిధులను సేకరించే ప్రక్రియను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతి రూ.100కోట్లకు రూ.13 కోట్లను ప్రోత్సాహాక బహుమతిగా అందజేస్తుందని తెలిపారు.