హైదరాబాద్

ఆనంద్‌బాగ్ ఆర్‌యూబీ నిర్మాణంపై కమిషనర్ అసహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మల్కాజ్‌గిరి సర్కిల్‌లోని ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు నిర్మిస్తున్న నాలుగు లేన్ల రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై కమిషనర్ దాన కిషోర్ తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణ పనులపై ఆయన మంగళవారం ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాన కిషోర్ మాట్లాడుతూ రూ. 27 కోట్ల వ్యయంతో 281 మీటర్ల పొడువున నిర్మిస్తున్న ఈ ఆర్‌యుబీని నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించటంతో పాటు 19 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించాల్సి ఉందని తెలిపారు. మొత్తం 19 ఆస్తుల్లో పది ఆస్తులకు సంబంధించి స్థలాలను ఇచ్చేందుకు యజమానులు అంగీకారాన్ని తెలిపినట్లు కమిషనర్ వెల్లడించారు. ఇప్పటికే రెండు ఆస్తుల నుంచి స్థలాలను సేకరించామని అధికారులు వివరించటంతో స్థల సేకరణలో జరగుతున్న ఆలస్యం కారణంగా నిర్మాణ పనులు మందకోడిగా సాగుతున్నాయని కమిషనర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ నిర్మాణ విషయంలో అనేక మంది సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని అధికారులకు వివరించారు. ఈ ఆర్‌యుబీని బుధవారం తాను స్వయంగా పర్యటించి, స్థల సేకరణ, వంతెన నిర్మాణ పనులకు ఎదురవుతున్న అడ్డంకులను, స్థానిక పరిస్థితులను సమీక్షించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.