హైదరాబాద్

ఫలించని ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : కోటిన్నర మంది జనాభాకు అవసరమైన, అత్యవసరమైన పౌరసేవలను అందించే జీహెచ్‌ఎంసీని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ఫలితాలనివ్వటం లేదు. ఇప్పటికే రెండు దఫాలుగా బాండ్ల ద్వారా రూ.395 కోట్లను సేకరించిన బల్దియా మూడోసారి చేసిన ప్రయత్నంలో ఆశించిన స్థాయిలో నిధులు సమకూరలేదు. తాజాగా మరో రూ. 305 కోట్లను సేకరించేందుకు మంగళవారం బిడ్డింగ్‌లను నిర్వహించగా, కేవలం రూ. వంద కోట్లు మాత్రమే సమకూరాయి. ఇందుకు స్టాక్ ఎక్స్ఛేంజీలో బల్దియా రేటింగ్ తగ్గిందా? జీహెచ్‌ఎంసీ అంటే మధుపరులు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపటం లేదా? అన్న చర్చ జరుగుతోంది. కానీ అధికారులు మాత్రం బాండ్ల ద్వారా నిధులను సేకరించటంలో జీహెచ్‌ఎంసీ రికార్డు సృష్టించిందని అధికారులు సమర్థించుకుంటున్నారు. ముఖ్యంగా ముంబై స్టాక్ ఎక్స్ఛేంజీలో బిడ్డింగ్‌కు వెళ్లి నియమిత సమయం కన్నా ముందుగానే వంద కోట్ల సేకరించే ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని చెబుతున్నారు. తొలుత రూ. 305 కోట్లకు బిడ్డింగ్ నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించినప్పటికీ స్టాక్ మార్కెట్‌లో ఏర్పడిన ఒడిదుడుకుల కారణంగా కేవలం రూ. వంద కోట్లు మాత్రమే సేకరించాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఆర్థిక సహాయం కూడా అంతంతమాత్రంగానే అందుతున్న పరిస్థితుల్లో బాండ్ల ద్వారా అవసరమైన స్థాయిలో నిధులను సమకూర్చుకోవాలని భావించిన బల్దియా అంచనాలు ఒక రకంగా తారుమారయ్యాయనే చెప్పవచ్చు. నిధుల సమీకరణకు చివరి అవకాశంగా మరో నెలరోజుల్లో మరో రూ. 200 కోట్లను సమకూర్చుకోవాలన్న జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి! తాజాగా సేకరించిన వంద కోట్ల రూపాయలను ఎస్‌ఆర్‌డీపీ పనులకు వినియోగించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
బిడ్డింగ్ సాగిందిలా
జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో బిడ్డింగ్ ప్రక్రియను మేయర్, కమిషనర్ పరిశీలించారు. ఉదయం పదకొండున్నర గంటల నుంచి పనె్నండున్నర గంటల మధ్య కొనసాగిన బిడ్డింగ్‌కు మరో 15 నిమిషాల సమయం ఉండగానే దాదా పు ఐదు సంస్థలు కలిపి మొత్తం రూ. వంద కోట్ల బిడ్‌లను దాఖలు చేశా యి. బ్యాంకులు అందజేసే రుణాల వడ్డీ కన్నా తక్కువ వడ్డీ సుమారు 8.93 వార్షిక వడ్డీతో ఈ వంద కోట్ల రూపాయలను జీహెచ్‌ఎంసీ సేకరించింది. ఈ వడ్డీ కూడా బల్దియాకు పెద్ద భారమేమీ కాదని, సుమారు ఐదు శాతం వార్షిక వడ్డీ ఎఫ్‌డీల ద్వారా వస్తోందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభంలో భాగంగా రొటీన్ మెయింటనెన్స్‌తో పాటు ఒక్క ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు కింద నిర్మించనున్న అంబర్‌పేట, బాలానగర్, ఉప్పల్ ఫ్లైఓవర్ల స్థల సేకరణకు సంబంధించి స్థలాలకు నష్టపరిహారం చెల్లించేందుకు రూ. 125 కోట్ల చెక్కులను సిద్ధం చేసి ఉంచారు. జీహెచ్‌ఎంసీ ఖాతాలో రూ. 125 కోట్లను జమ చేసిన తర్వాత చెక్కులను యజమానులకు అందించాలని బల్దియా అధికారులు భావిస్తున్నారు. ఆశించిన స్థాయిలో బాండ్ల ద్వారా నిధులు సమకూరకపోవటం స్థల సేకరణ ప్రక్రియపై ప్రభావం చూపుతోందని చెప్పవచ్చు.