హైదరాబాద్

రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్న ఈస్ట్ ఆనంద్ బాగ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దాన కిషోర్ ఆదేశించారు. బుధవారం మల్కాజ్‌గిరి సర్కిల్ పరిధిలోని ఈస్ట్ ఆనంద్ బాగ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. జోనల్ కమిషనర్ శంకరయ్య, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ సతీష్ మల్కాజ్‌గిరి ఆర్టీవో మధుసూదన్, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి బ్రిడ్జి నిర్మాణాన్ని కొనసాగించేందుకు ఉన్న అడ్డంకులను కేత్రస్థాయిలో పరిశీలించారు. దాన కిషోర్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే బ్రిడ్జి అప్రోచ్ రోడ్లను వెంటనే ప్రారంభించాలని, అడ్డంగా ఉన్న వాటర్ పైప్‌లైన్, అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుళ్లను యుద్ధప్రాతిపాదికన తొలగించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఆర్‌యూబీకి ఇరువైపులా అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి చేపట్టాల్సిన ఆస్తుల సేకరణను వెంటనే చేపట్టాలని మాల్కాజ్‌గిరి జాయింట్ కలెక్టర్‌కు సూచించారు. రెండు రోజుల్లో వాటర్ పైప్‌లైన్, విద్యుత్ కేబుళ్ల తరలింపుపై చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి దక్షణ మధ్య రైల్వే తన వాటాగా బాక్స్ పోర్షన్‌ను రూ.15.10 కోట్ల వ్యయంతో ఈ ఏడాది మార్చిలోనే పూర్తి చేసిందని చెప్పారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ లైన్ల తొలగింపునకు రూ.1.95 కోట్లు, వాటర్ పైప్‌లైన్ తొలగింపునకు రూ.8కోట్ల మంజూరైనందున ఆస్థుల సేకరణకు వేచి చూడకుండా తక్షణమే పనులను ప్రారంభించాలని సూచించారు. పనుల పురోగతిపై త్వరలోనే మరోసారి సమావేశం నిర్వహిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.