హైదరాబాద్

నిర్వహణ ఇలానేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరవాసులకు మెరుగైన సేవలందించేందుకు అభివృద్ధిని వేగవంతం చేయటంతో పాటు మెయింటనెన్స్ విభాగంలో పలు మార్పు తెచ్చేందుకు తరుచూ కమిషనర్ దాన కిషోర్ నిర్వహిస్తున్న క్షేత్ర స్థాయి పర్యటనల్లో ఎన్నో వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. గురువారం కమిషనర్ అంబర్‌పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించారు. చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి కమిషనర్ అంబర్‌పేట స్లాటర్ హౌజ్‌ను సందర్శించారు. సుమారు రూ.22.15 కోట్ల వ్యయంతో అత్యాధునిక యంత్రాలను సమకూర్చి ఏర్పాటు చేసిన స్లాటర్ హౌజ్ నిర్వాహణ సరిగ్గా లేదంటూ మండిపడ్డారు. కొద్దిరోజులుగా స్లాటరింగ్ జరగకుండా వృథాగా ఉంచటంపై కమిషనర్ అసహనాన్ని వ్యక్తం చేస్తూ కోట్లాది రూపాయలను ఖర్చు చేసి నిర్మించింది వృథాగా పెట్టేందుకా? అని మండిపడ్డారు. పైగా ఈ స్లాటర్ హౌజ్ నిర్వహణ బాధ్యతలను చేజిక్కించుకున్న సంస్థకు మూడేళ్ల ఒప్పందం కుదిర్చి, 2018 జనవరిలోనే ఒప్పందం గడువు ముగిసినా, ఈ సంస్థను ఎందుకు టెర్మినేషన్ చేయలేదని ప్రశ్నించారు. స్లాటర్ హౌజ్ నిర్వహణ నిమిత్తం సదరు సంస్థ జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన రాయల్టీకి సంబంధించిన చెక్కులను ఇచ్చినా, అవి బౌన్స్ అవుతున్నా, ఎందుకు కేసులు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీఫ్ వెటర్నరీ అధికారి జోక్యం చేసుకుని, లీజు పీరియడ్ ముగిసినా, సంస్థను టెర్మినేషన్ చేయరాదంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు. కేసుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ వెకేషన్ పిటిషన్ సమర్పించినట్లు తెలిపారు. జీవాలను స్లాటర్‌హౌజ్‌లో కాకుండా బయట ఉన్న ఖాళీ స్థలంలో స్లాటరింగ్ చేస్తున్నారని, దీంతో స్లాటర్ హౌజ్‌కు జీవాలు రాక స్లాటరింగ్ జరగటం లేదని వివరించటంతో, బయట స్లాటరింగ్‌కు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. నగరంలోని అన్ని స్లాటర్ హౌజ్‌ల పనితీరుపై త్వరలోనే ఓ ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
అభివృద్ధిపై సమీక్ష
అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో సుమారు 800 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నట్లు రికార్డుల్లో పేర్కొంటున్నా, క్షేత్ర స్థాయిలో కనీసం 400 మంది కార్మికులు కూడా విధులు నిర్వర్తిస్తున్నట్లు కన్పించటం లేదని వివరించారు. చాలా మంది కార్మికులు వయోవృద్థులైపోయారని, మరికొందరు మృతిచెందారని, వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను నియమించాలని కమిషనర్‌ను కోరారు. త్వరితగతిన చెత్తను సేకరించి, తరలించేందుకు అవసరమైన సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు, ట్రైసైకిళ్లను కేటాయించాలని అన్నారు. జిందా తిలిస్మాత్ రహదారితో పాటు పలు ప్రధాన రహదారులకు మరమ్మతులను చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. త్వరలోనే పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.