హైదరాబాద్

ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో హెల్ప్‌లైన్, హెల్ప్‌డెస్క్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: నగరంలోని ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో హెల్పింగ్ హాండ్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్, హెల్ప్‌డెస్క్‌ను హెల్త్‌అండ్ మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తివారీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపబడుతున్న ఎమ్‌ఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రిలో హెల్ప్‌లైన్, హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించడం ముదావహమన్నారు. అణగారిన వర్గాలకు చేయూతనిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ హెల్ప్‌లైన్, హెల్ప్‌డెస్క్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత, మేనేజింగ్ ట్రస్టీ అండ్ ప్రెసిడెంట్ ముజ్తబా ససన్ అస్కారి తదితరులు పాల్గొన్నారు. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా రోగులకు సంబంధించి ఆరోగ్యశ్రీ, ఆసుపత్రిలో నమోదుకాని ప్రోస్తటిక్స్, కీమో పోర్ట్, కీమో డ్రగ్స్ వైద్య అవసరాలపై, క్యాన్సర్ నివారణ, ఆరోగ్యకరమైన జీవన విధానం, త్వరగా కోలుకోవడానికి కావలసిన పోషక విలువలు కలిగిన ఆహారంపై కౌనె్సలింగ్ ఇస్తారని పేర్కొన్నారు. రోగుల్లో ఆత్మస్థయిర్యాన్ని పెంచి వలంటీర్లతో సేవలందించేందుకు కృషి జరుగుతుందని తివారి పేర్కొన్నారు.