హైదరాబాద్

బహుముఖ ప్రజ్ఞాశాలి బీఎస్ రాములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : బహుముఖ ప్రజ్ఞాశాలి బీఎస్ రాములు అని వక్తలు కొనియాడారు. ప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా బీసీ కమీషన్ చైర్మెన్ బీస్ రాములుకు సాహితీ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం లక్ష్యసాధన ఫౌండేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి పాల్గొని బీఎస్ రాములుకు పురస్కారం ప్రదానం చేశారు. బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ బహుజనుల, వెనుకబడిన వర్గాలలో చైతన్యం తీసుకురావాడానికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. తెలుగు భాషా చైతన్య సమితి సంపాదకుడు డా.వీ.జయప్రకాష్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో విశ్వసాహితీ అధ్యక్షుడు డా.బీ.జయ రాములు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, రాజారత్నం, సంస్థ చైర్మెన్ ప్రజ్ఞారాజు, వ్యవస్ధాపక అధ్యక్షుడు పీ.బడేసాబ్, రాజ గోపాల్ నాయుడు పాల్గొన్నారు.
‘రసమంజూష’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, ఆగస్టు 24: ప్రముఖ కవి కాసోజు లక్ష్మీనారాయణ రచించిన ‘రసమంజూష’ పుస్తకావిష్కరణ సభ ధర్మకేతనం సాహిత్య కళాపీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహా రెడ్డి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ కవి విహారి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, నేటి నిజం సంపాదకుడు బైస దేవదాసు, కవి సురారం శంకర్, సంస్థ అధ్యక్షుడు భీష్మాచారి, రఘువీర్ ప్రతాప్ పాల్గొన్నారు.
ఇరివెంటి సేవలు చిరస్మరణీయం
కాచిగూడ, ఆగస్టు 24: ప్రముఖ సాహితీవేత్త ఇరివెంటి కృష్ణమూర్తి సాహిత్య రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి అన్నారు. ఇరివెంటి కృష్ణమూర్తి జయంతి సందర్భంగా మహాకవి దేవులపల్లి కృష్ణశాస్ర్తీ ‘సాహిత్య - వ్యక్తిత్వం’ సాహితీ సమాలోచన సమావేశం యువభారతి ఫౌండేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేవీ రమణా చారి పాల్గొని ప్రసంగించారు. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ రచనలు సమాజానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. ప్రముఖ రచయిత్రి డా.నిడమర్తి నిర్మలాదేవికి ఇరివెంటి కృష్ణమూర్తి స్మారక పురస్కారం, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వెలుదండ నిత్యానంద రావుకు డా.తిరుమల శ్రీనివాసాచార్య, స్వరాజ్యలక్ష్మీ ధర్మనిధి పురస్కారాలను ప్రదానం చేశారు. సుప్రసిద్ధ విమర్శకుడు ఆచార్య ఎస్వీ రామారావు సభాధ్యక్షత వహించగా దాశరథి పురస్కార గ్రహీత డా.తిరుమల శ్రీనివాసా చార్య, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఆచార్య ఫణీంద్ర, జీడిగుంట వెంకట్రావు పాల్గొన్నారు.