హైదరాబాద్

మదర్ థెరిస్సా ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : మదర్ థెరిస్సాను ఆదర్శంగా తీసుకుని సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆకాక్షించారు. ప్రముఖ సంఘా సేవకురాలు మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా హెల్త్‌కేర్ ఇంటర్నేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ‘మదర్ థెరిస్సా’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోశయ్య పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. మదర్ థెరిస్సా ప్రపంచ వ్యాప్తంగా తన సేవలను విస్తరించారని కొనియాడారు. మదర్ థెరిస్సా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. డాక్టర్ బాల శ్రీనివాస మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రవికాంత్, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ, సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.

పవిత్రోత్సవాలు ప్రారంభం

హైదరాబాద్, ఆగస్టు 25: రంగారెడ్డి జిల్లా జిలెల్లగూడాలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రథమ పవిత్రోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ ఆలయంలో ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. సాయంత్రం ఆరు గంటలకు అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మురళీకృష్ణ, ప్రధాన పూజారి డింగరి రామాచార్యులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవిత్స్రోవాలు ఈ నెల 28 వరకు జరుగుతాయి.