హైదరాబాద్

రాజకీయ భజనలతో భక్తి భజనలు కనుమరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: భక్తితో భజన చేస్తే భగవంతుడు సాక్షాత్కారమవుతాడు కానీ ప్రస్తుత కాలంలో భక్తి భజనలు తగ్గిపోయి రాజకీయ భజనలు ఎక్కువైనాయని తెలంగాణ రాష్ట్ర సలహాదారులు కెవి రమణాచారి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ నిర్వహిస్తున్న భక్త్భిజన సంకీర్తన పోటీలను సోమవారం ఉదయం రవీంద్రభారతిలో కెవి రమణాచారి ప్రారంభించారు. భజన తల్లివంటిదని, సామాన్యులకు భజనలు మంగళశాసనాలు అవ్వాలని అన్నారు. వ్యాసమహాముని చెప్పినట్లు ధర్మం ఎక్కడుందో అక్కడే భగవంతడు ఉంటాడు.. తాను తిరుమలలో టిటిడి ఇవోగా ఉండగా 2007 జూలై 7వ తేదీన ఏడు గంటలకు అఖండ హరినామ సంకీర్తన భజన సంప్రదాయాన్ని ప్రారంభించానని అన్నారు. ఈ నాటికి భజన బృందాలు తిరుమలకు వెళ్తే అన్ని సదుపాయాలు దేవస్థానం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీరామ పీఠం అధిపతి వెంకటరామకృష్ణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కో ఆర్డినేటర్ డా.ఎస్. విజయభాస్కర్, సంస్థ అధ్యక్షురాలు కె.సుధారాణి పాల్గొన్నారు. తొలుత సంస్థ కార్యదర్శి జె.శివప్రసాద్ మాట్లాడుతూ ఆరు రోజులపాటు జరిగే ఈ భజన పోటీలలో జంటనగరాలతోపాటు రంగారెడ్డి జిల్లా, మెదక్, మహబూబ్‌నగర్ కళాకారులు పాల్గొంటారని తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భజన పోటీలు జరుగుతాయని తెలిపారు.