హైదరాబాద్

టెన్నిస్ క్రీడాకారుడు బోస్ కిరణ్‌ను అభినందించిన డీజీపీ మహేందర్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చైనాలో జరిగిన ప్రపంచ పోలీసు క్రీడోత్సవాల్లో తెలంగాణ పోలీసు శాఖకు చెందిన లాన్ టెన్నిస్ క్రీడాకారుడు బోస్ కిరణ్ సత్తాచాటాడు. చైనాలో ఆగస్టు 8 నుంచి 18 వరకు జరిగిన ఈ క్రీడోత్సవాలో 70 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బోస్ కిరణ్ టెన్నిస్ పోటీల్లో అద్భుతంగా రాణించి 40 సంవత్సరాల వయసు గ్రూపులో జరిగిన సింగిల్స్, డబుల్స్‌లో పోటీలో మూడో స్థానంలో నిలిచి రెండు కాంస్య పతకాలు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి కూకట్‌పల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బోస్ కిరణ్‌ను అభినందించి సత్కరించారు. డీజీపీ మాట్లాడుతూ పోలీసు అధికారులు వృత్తి రీత్యా ఎంతో బీజీ జీవితాన్ని గడపుతున్న బోస్ కిరణ్ టెన్నిస్ క్రీడలో సాధన చేస్తూ అంతర్జాతీయ స్థాయి పోటీలో పతకాలు సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు.

వేదగణితంపై జాతీయ సదస్సు
ఖైరతాబాద్, సెప్టెంబర్ 9: వేదిక్ మ్యాథ్స్ ఫోరం ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో అవగాహన కల్పించేందుకు ఈనెల 13వ తేది నుంచి చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో మూడు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్టు ఫోరం అధ్యక్షుడు సాయి కిరణ్ తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్యతో కలిసి వివరాలను వెల్లడించారు. 13వ తేది నుంచి 16 వరకు జరిగే ఈ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేదగణిత పండితులు హాజరు అవుతున్నట్టు తెలిపారు. సమావేశంలో సీతారామా రావు, విజయ్ రావు, రమేష్, వెంకటరమణ పాల్గొన్నారు.

ఆంధ్రభూమి బ్యూరో