హైదరాబాద్

కృష్ణ పూజారికి ఆత్మీయ సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : బహుజన సాహిత్య అకాడమీ, దళిత సంఘర్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ సామాజిక వేత్త కృష ణపూజారికి ఆత్మీయ సత్కర కార్యక్రమం బుధవారం శ్రీవేదిక కనె్వన్షన్ హాల్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ పాల్గొని కృష్ణ పూజారికి ఆత్మీయ సత్కరం చేశారు. కృష్ణపూజారి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి మహాత్మజ్యోతి బాపూలే, సేవరత్న, ఎన్టీ ఆర్ పురస్కారాలను అందుకున్నారని తెలిపారు. కృష్ణపూజారి సమాజంతో పాటు గాంధీ ఆసుపత్రిలో రోగులకు సేవలు అందిస్తున్నారని కీర్తించారు. ఆయన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మ్యాడం వెంకట్రావ్, మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మెన్ చంద్రశేఖర్, షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ బాబు పాల్గొన్నారు.
14న నటి కవితకు
‘నటీ తిలకం’ బిరుదు ప్రదానం
కాచిగూడ, సెప్టెంబర్ 11: ప్రముఖ సినీ నటి కవితకు ‘నటీ తిలకం’ బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేది రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు తెలిపారు. బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ వంశీ ఆర్ట్ థియేటర్స్ 47వ వార్షికోత్సవం సందర్భంగా కవితకు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణ కంకణం బిరుదును ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. కవిత నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో రాణించారని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా.టీ.సుబ్బరామి రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి, ప్రజానటి జమునా రమణారావు, నటులు గిరిబాబు, దర్శకుడు రేలంగి నరసింహా రావు పాల్గొంటారని తెలిపారు.
ప్రజా కవి కాళోజీ
కాచిగూడ, సెప్టెంబర్ 11: ప్రజల కోసం రచనలు చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ డా.నందిని సిధారెడ్డి అన్నారు. కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ప్రముఖ కవి రావికంటి వసునందన్‌కు ‘కాళోజీ సాహితీ’ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం కళానిలయం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందిని సిధారెడ్డి పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. కాళోజీ నిరంతరం ప్రజల పక్షన నిలబడి ప్రజా ఉద్యమం చేశారని తెలిపారు. ఆధ్యాత్మిక వేత్త డా.పులివర్తి కృష్ణమూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ప్రముఖ కవి నాళేశ్వరం శంకరం, డా.కావూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.